Health Tips | వ్యాయామంతో కంటి ఆరోగ్యం మెరుగు
నిత్యం వ్యాయామం చేయడం ద్వారా కేవలం ఫిట్నెస్ కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరతాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి.
న్యూఢిల్లీ : నిత్యం వ్యాయామం చేయడం ద్వారా కేవలం ఫిట్నెస్ కాకుండా పలు ఆరోగ్య ప్రయోజనాలు (Health Tips) చేకూరతాయని అధ్యయనాలు స్పష్టం చేశాయి. వ్యాయామంతో మధుమేహం, హృద్రోగ ముప్పు తగ్గడమే కాకుండా కంటి ఆరోగ్యం కూడా మెరుగవుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేపట్టిన అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 28.5 కోట్ల మంది దృష్టి లోపాలతో బాధపడుతుండగా, 3.9 కోట్ల మంది అంధత్వంతో బాధపడుతున్నట్టు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఒత్తిడిని మటుమాయం చేసే నిర్ధిష్ట వ్యాయామాలతో కంటి వ్యాధులు దరిచేరకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టవచ్చని తాజా అధ్యయనం పేర్కొంది. మన వయసు పెరిగే కొద్దీ కండ్లు అనేక వ్యాధుల బారినపడే ముప్పు అధికమవుతుంది. వయసు మీదపడే క్రమంలో వయో సంబంధ మాక్యులర్ డీజనరేషన్ (ఏఎండీ), క్యాటరాక్ట్స్, డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా సహా దృష్టి లోపాల వంటి పలు కంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి.
నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఈ తరహా ముప్పులను నియంత్రించవచ్చని, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ వెల్లడించింది. నిలకడగా వర్కవుట్స్ చేయడం కొనసాగించే వ్యక్తుల్లో కంటి సమస్యలతో తలెత్తే లక్షణాలు గణనీయంగా తగ్గాయని పరిశోధణల్లో స్పష్టమైందని చెబుతున్నారు. కండ్లు పొడిబారే సమస్య నుంచి సైతం నిత్యం వ్యాయామం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించవచ్చని వెల్లడైంది. రోజూ వ్యాయామం చేయడం ద్వారా ఐ మాయిశ్చర్ కొనసాగించడం, కార్నియా కాపాడుకోవచ్చని 2022లో చేపట్టిన ఎక్స్పరిమెంటల్ ఐ రీసెర్చి అధ్యయనం స్పష్టం చేసింది.
Read More :
Health tips | ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోసమే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- diabetic
- exercise
- eyes
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

