Stress | మావాడు ఈమధ్య పరధ్యానంగా కనిపిస్తున్నాడు.. ఇదేమైనా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడా?
మా బాబు పదోతరగతి చదువుతున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నాయి. కానీ ఈమధ్య పరధ్యానంగా కనిపిస్తున్నాడు. ఇదేమైనా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడా? లేక మానసిక సమస్యా? మాకు భయంగా ఉంది. మీరే పరిష్కారం చెప్పాలి.
Stress | మా బాబు పదోతరగతి చదువుతున్నాడు. పరీక్షల్లో మంచి మార్కులే వస్తున్నాయి. కానీ ఈమధ్య పరధ్యానంగా కనిపిస్తున్నాడు. ఇదేమైనా పరీక్షలకు సంబంధించిన ఒత్తిడా? లేక మానసిక సమస్యా? మాకు భయంగా ఉంది. మీరే పరిష్కారం చెప్పాలి.
– ఓ పాఠకురాలు
చదువుల్లో తగినంత ఒత్తిడి మంచిదే. పరీక్షల పట్ల కొంతమేర ఆందోళనా సహజమే. దీనివల్ల పిల్లలు లక్ష్యం మీద గురిపెడతారు. మీ బాబు విషయంలో ఆ తీవ్రత కొంత ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. నిజానికి, చదువుల ఒత్తిడి సమాజంలో తీవ్ర సమస్యగా మారుతున్నది. ఆత్మ హత్యలకూ దారితీస్తున్నది. రోజూ పదహారు గంటలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. ఏకధాటిగా చదివితే ఇట్టే అలసిపోతారు.
ఆ చదువులో నాణ్యత ఎంత అన్నదే ముఖ్యం. సరైన ప్రణాళికా అవసరం. ఆహారం, విశ్రాంతి మీద కూడా దృష్టిపెట్టాలి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం కన్నవారిగా మీ బాధ్యత. అదే సమయంలో మీ బాబు ఆలోచనలు ఎలా ఉన్నాయి? సరిగా నిద్రపోతున్నాడా? సాధారణ వాతావరణంలోనూ చెమటలు పోస్తున్నాయా? అతిగా తినడం.. లేదంటే అసలే తినకపోవడం కూడా ఉన్నదా?.. ఈ విషయాల్ని కూడా గమనించండి. తనకు ఎలాగూ మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి, ఫలితాల విషయంలో ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పండి. మేమున్నాం.. అనే భరోసా ఇవ్వండి. అవసరమైతే మంచి సైకాలజిస్టు దగ్గరికి తీసుకెళ్లండి.
డాక్టర్ విజయానంద్
నియోనేటాలజిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Exam stress
- Exams
- stress
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

