కరోనా నుంచి కోలుకుని కసరత్తులు చేస్తున్నారా..?

న్యూఢిల్లీ : కరోనా నుంచి కోలుకోగానే మునుపటి మాదిరిగా వెంటనే వ్యాయామం మొదలుపెట్టేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కొవిడ్-19 నుంచి కోలుకుని నెగెటివ్ వచ్చినా ఇన్ఫెక్షన్ ప్రభావంతో శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతిని కోలుకునేందుకు సుదీర్ఘ సమయం పడుతుంది.
కరోనా రోగులు కోలుకునే తీరు అందరిలో ఒకేలా ఉండదు. ఎలాంటి అనారోగ్య కారకాలు లేవని పూర్తిగా నిర్దారించుకుని వైద్యుల సూచనలు తీసుకున్నాకే వర్కవుట్లకు దిగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలం అనంతరం వ్యాయామాన్ని తిరిగి ప్రారంభిస్తున్నందున ఒక్కసారిగా కసరత్తుల వేగం పెంచకుండా మెల్లిగా వ్యాయామంలో వేగం అందుకోవాలి. ముందుగా తేలికపాటి, ఓ మోస్తరు వ్యాయామాలతో వర్కవుట్ రొటీన్ ప్రారంభించాలి. ఏమాత్రం అలసట అనిపించినా వ్యాయామానికి బ్రేక్ ఇవ్వాలి.
కసరత్తులతో సరిపెట్టకుండా సమతులాహారం తీసుకోవడం కీలకమని గ్రహించాలి. ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉన్న ఆహారంతో పాటు ఇతర పోషకాలు అందేలా చూసుకోవాలి. కరోనా నెగెటివ్ ఫలితం వచ్చినా కొందరిలో కొవిడ్ అనంతర లక్షణాలు దీర్ఘకాలం వేధించే అవకాశం ఉంది. అలాంటి వారు వ్యాయామంలో ఏమాత్రం అలసట, నిస్సత్తువ ఆవహించినట్టు అనిపించినా కసరత్తులకు విరామం ఇవ్వడం మేలు. రికవరీ అనంతరం ఫిట్ నెస్ గోల్స్ వాస్తవికంగా ఉండేలా చూసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో నాలుగు వెంటిలేటర్లు మాయం.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డు!
Sandeep Reddy Vanga | రాప్తాడు ఘటనపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్.. విషాదాన్ని అవకాశంగా మార్చుకోవద్దు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

