Health tips | పొట్టకింది కొవ్వును తగ్గించే సింపుల్ టిప్స్ మీ కోసం..!
Health tips | అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా కనిపిస్తుంటారు. అందుకే బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు.
Health tips : అతిగా ఆహారం తీసుకోవడం, మానసిక ఒత్తిడి, కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, హార్మోన్ల మార్పులు తదితర అనేక కారణాలవల్ల పొట్టకింద కొవ్వు పెరుగుతుంది. పొట్టచుట్టూ కొవ్వు చేరడంవల్ల అందహీనంగా కూడా కనిపిస్తుంటారు. అందుకే బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. నచ్చిన ఫుడ్‌కు దూరంగా ఉంటారు. చెమటలు చిందేలా వ్యాయామాలు చేస్తారు. అయినా ఫ్యాట్ తగ్గక ఆవేదన చెందుతుంటారు. కానీ కొన్ని సింపుల్ టిప్స్‌ను ఫాలో అయితే బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా తగ్గించుకోవచ్చు.
చిట్కాలు
బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవాలనుకునేవారు ముందుగా అల్లంటీని డైలీ డైట్లో చేర్చుకోవాలి. అల్లం టీ తీసుకోవడంవల్ల శరీరంలో సహజంగా వేడిని పుడుతుంది. ఈ వేడి అధిక కేలరీలను, కొవ్వును కరిగిస్తుంది.
అలాగే ప్రతి రోజు ఉదయం నానబెట్టిన బాదాం గింజలను ఎనిమిది నుంచి పది వరకు తీసుకోవాలి. ఎందుకంటే బాదాంలో ఉండే మెగ్నీషియం మజిల్ స్ట్రెంథ్‌ను పెంచుతుంది. తద్వారా బెల్లీ ఫ్యాట్ త్వరగా తగ్గుతుంది.
ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండే బాదాం పప్పు తీసుకోవడంవల్ల ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. ఫలితంగా పొట్టకింద కొవ్వు తగ్గిపోతుంది.
ప్రతి రోజు ఉదయం లేదా రాత్రి సమయంలో ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవాలి. గ్రీన్ టీ కూడా బెల్లీ ఫ్యాట్‌ను సులువుగా కరిగిస్తుంది.
అలాగే రాత్రిపూట వరి అన్నానికి బదులుగా ఓట్స్ లేదా బ్రౌన్ రైస్ తీసుకోవాలి. తద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌కు చెక్ పెట్టవచ్చు. వరి అన్నంతో ఫ్యాట్ పేరుకుపోతుంది.
అదేవిధంగా రోజూ నీరు కూడా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. శరీరానికి సరిపడా నీరు అందినప్పుడే టాక్సిన్స్ తొలగిపోయి పొట్టచుట్టూ కొవ్వు కరుగుతుంది.
అవకాడో, పైనాపిల్, పుచ్చకాయ, నిమ్మ, క్యారెట్ లాంటి వాటిని డైట్లో చేర్చుకోవడం ద్వారా కూడా పొట్టకింద కొవ్వును కరిగించుకోవచ్చు.
అంతేగాక క్రమం తప్పకుండా ఓ ఇరవై నిమిషాలపాటు వ్యాయామాలు చేయడం ద్వారా కూడా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

