గ్రీన్ టీని అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
గ్రీన్ టీ | గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే.

గ్రీన్ టీని నిత్యం తాగడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. గ్రీన్ టీ తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అయితే గ్రీన్ టీని మన శరీరానికి మంచిదే కదా అని చెప్పి చాలా మంది అదే పనిగా కప్పుల కొద్దీ గ్రీన్ టీని నిత్యం తాగుతుంటారు. నిజానికి అది మంచిది కాదు.
దాంతో మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు కలగకపోగా.. అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి గ్రీన్ టీని ఎక్కువగా తాగితే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
గ్రీన్ టీని అధికంగా తాగితే హైబీపీ వస్తుంది. రక్తప్రసరణ వేగంగా జరుగుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
గ్రీన్ టీ అధికంగా తాగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయి అసిడిటీ వస్తుంది. జీర్ణక్రియ మందగిస్తుంది.
గ్రీన్ టీని ఎక్కువగా తాగితే మనం తినే ఆహారంలో ఉండే పోషకాలను శరీరం ఎక్కువగా శోషించుకోలేదు.
గ్రీన్ టీని అధికంగా తీసుకుంటే మన శరీరంలో హార్మోన్ల పనితీరులో సమతుల్యత దెబ్బ తింటుంది. హార్మోన్ల సమస్యలు వస్తాయి.
గ్రీన్ టీని అధికంగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక గ్రీన్ టీని నిత్యం 2 లేదా 3 కప్పులకు మించకుండా తాగాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

