Pregnant food | వానాకాలంలో గర్భిణీలకు డైట్, ముందు జాగ్రత్తలివీ..!
Pregnant food | ర్భధారణ సమయంలో తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. వానాకాలంలో అయితే మరీ ఎక్కువ. జలుబు, ఇతర జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Pregnant food | గర్భధారణ సమయంలో తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు ఎన్నో వ్యాధులు, సమస్యలు మహిళల్ని చుట్టుముడతాయి. వానాకాలంలో అయితే మరీ ఎక్కువ. జలుబు, ఇతర జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా చేతులు కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని నివారించడం వంటి ప్రామాణిక జాగ్రత్తలతో పాటుగా ఆహారంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఆరోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేకంగా వానాకాలంలో గర్భిణీలు ప్రత్యేక డైట్‌తోపాటు పలు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం
ఇంట్లో వండిన ఆహారం..
వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నప్పుడు మన ఆకలి కూడా మారుతుంది. వేడివేడిగా ఉండే కొత్త ఆహారాలను కోరుకోవడం చాలా సహజం. అయితే, గర్భిణీలు ఈ సమయంలో తాము తినే ఆహారాల గురించి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. బయటి ఆహారాలు ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ, వానాకాలంలో మాత్రం ఇంట్లో వండిన ఆహారాన్ని తినేందుకే మొగ్గు చూపాలి. వీటిలోనూ ఎక్కువ పోషకాలు ఉండే డైట్‌ను చేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి. ఇంట్లో వండే వంటలు ఫుడ్ పాయిజనింగ్‌కు చాలా తక్కువ కారణమవుతాయి. హానికారక బ్యాక్టీరియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఫ్రై చేసిన స్నాక్స్ లేదా ఫాస్ట్ ఫుడ్ కోసం కాకుండా.. ఇంట్లోనే వండుకునే రుచికరమైన, పోషకాలతో నిండిన ఆహారాలను ఆస్వాదించాలి.
హైడ్రేటెడ్‌గా ఉండటం..
గర్భిణీలు తప్పనిసరిగా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. వానాకాలంలో ఇది మరీ ముఖ్యం. ఎందుకంటే తడి, తేమతో కూడిన వాతావరణం కారణంగా మనం తక్కువ నీటిని తీసుకుంటుంటాం. అయితే, గర్భధారణ సమయంలో మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు, ప్రీఎక్లాంప్సియా, నెలలు నిండకుండానే ప్రసవం వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటున్నందున.. వీటి నివారణకు మంచి నీటిని ఎక్కువగా తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ఇంట్లో తయారుచేసిన పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగను కూడా తీసుకోవడం కూడా మంచి ఎంపికే. చక్కెర పానీయాలు, కెఫిన్, ఆల్కహాల్లను దూరం పెట్టాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది.
తాజా ఆహారాలు తినడం..
గర్భధారణ సమయంలో తాజా ఆహారాన్ని తినడం చాలా మంచిది. ముందుగా ప్యాక్ చేసిన చక్కెర లేదా వేయించిన ఆహారాలు పలు ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి. గర్భధారణ మధుమేహం, అధిక బరువు పెరగడం, థైరాయిడ్ సమస్యలు, ఇతర జీవక్రియ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. గర్భం ధరించిన నాటి నుంచే తాజా ఆహారాలను తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలను తినడంపై దృష్టి పెట్టడం వల్ల గర్భధారణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. రక్తంలో చక్కెరలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
వర్షాకాలంలో సులువుగా లభించే తాజా పండ్లు, కూరగాయలు సమృద్ధిగా ఉంటాయి. నారింజ, బెర్రీలు, బచ్చలికూర, తీపి నిమ్మకాయలు, క్యాబేజీ, ద్రాక్షపండ్లతోపాటు ఇతర పండ్లు, కూరగాయలను తినాలి. ఫలితంగా గర్భిణీలకు అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి వారి ఆరోగ్యంతోపాటు కడుపులో బిడ్డకు అవసరమైన పోషకాలను అందేలా చేస్తుంది. గర్భిణీలు వానాకాలంలో పచ్చి ఆహారం తీసుకోవద్దు. బాగా ఉడికించిన ఆహారాలను తీసుకోవడం ద్వారా జీర్ణసంబంధ సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
No Relief For CJP | అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు.. కస్టడీని పొడిగించిన కోర్టు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

