కరోనా నుంచి కోలుకొని రెండేళ్లవుతున్నా వెంటాడుతున్న సమస్యలు..! ఏయిమ్స్ అధ్యయనంలో కీలక విషయాలు
Delhi AIIMS Survey | కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా.. పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలామంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట
AIMS Study | కరోనా మహమ్మారి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా.. పోస్ట్ కొవిడ్ సమస్యలు వెంటాడుతున్నాయి. రెండేళ్ల కిందట వైరస్ బారినపడి పూర్తిస్థాయిలో కోలుకున్నా చాలామంది పలు సమస్యలతో బాధపడుతున్నారు. రెండేళ్ల కిందట కిలోమీటర్ల కొద్దీ నడిచిన వారంతా.. ఇప్పుడు 400 నుంచి 500 మీటర్ల నడిస్తేనే తీవ్రంగా అలసటకు గురవుతున్నారు. అంతేకాకుండా నిద్రలేమి, జుట్టరాలడం, శ్వాస సరిగా ఆడకపోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు అధ్యయనంలో తేలింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) కొవిడ్ అనంతర పరిస్థితులపై ఓ సర్వే ద్వారా నిర్వహించిన అధ్యయంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనం DovPress మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైంది.
అధ్యయనంలో వైద్యులు దేశంలో పలు ప్రాంతాల నుంచి కరోనా మొదటి, రెండో వేవ్‌లో వైరస్ బారినపడిన ఎంపిక చేసిన రోగులతో వారి దినచర్యపై చర్చించారు. అయితే, 2020-2021 సమయంలో ఆసుపత్రిలో చేరిన తర్వాత వారి జీవితం పూర్తిగా మారినట్లు గుర్తించారు. ఓ వ్యక్తి కరోనా బారినపడి కోలుకున్నా.. అతను ఎనిమిది గంటలు పని చేయడం కష్టతరంగా మారినట్లు కనుగొన్నారు. ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పర్యవేక్షణలో ఈ అధ్యయనం జరిగింది. వివిధ రాష్ట్రాలకు చెందిన 1800 మందిని ఎంపిక చేసి, వారితో ఫోన్లో సంభాషించారు. ప్రస్తుత దినచర్యకు సంబంధించి పలు ప్రశ్నలు వేసి సమాధానాలు ఆరా తీశారు. ఇందులో 79.3శాతం అలసట, 33.4శాతం మంది కీళ్ల నొప్పులు, 29.9శాతం గౌట్, 28శాతం జుట్టు రాలడం, 27.2శాతం తలనొప్పి, 25.3శాతం శ్వాస ఆడకపోవడం, 25.30శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు.
కరోనా బారిన పడిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చిందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చాలా యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అధ్యయనం ప్రకారం.. పోస్ట్ కొవిడ్ 12 వారాల్లో 12.8 శాతానికి తగ్గింది. మహిళలు, వృద్ధాప్యం, ఆక్సిజన్ తీసుకోవడంలో సమస్యతో పాటు ఇప్పటికే ఉన్న ఇతర వ్యాధులు పోస్ట్ కోవిడ్‌కు కారకాలని వైద్యులు పేర్కొంటున్నారు. కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీబాడీలు అభివృద్ధి చేయడంతో పాటు సంక్రమణను నిరోధించడమే కాకుండా.. పోస్ట్ కోవిడ్‌గా అనుమానించిన వారిలో 39శాతం మందిలో లక్షణాలు పెరుగకుండా కాపాడబడినట్లు అధ్యయనం ధ్రువీకరించింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

