Hair straightening | కర్లీ హెయిర్‌ను స్ట్రెయిటెనింగ్ చేయడం ప్రాణాంతకం.. అమెరికాలో పెరుగుతున్న కేసులు
hair straightening | వంకర్లు తిరిగి ఉండే జట్టును సాఫీగా చేయడం చూడ్డానికి అందంగా కనిపిస్తున్నా.. ఆరోగ్యపరంగా మాత్రం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. కెమికల్ హెయిర్ స్ట్రెయిటనర్ వాడటం వల్ల యూటెరైన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని..
hair straightening | తల వెంట్రుకలు పట్టుదారాల్లా సాఫ్‌గా ఉండాలని ప్రతీ మహిళ కోరుకోవడం సహజం. అయితే, కర్లీగా ఉండే జుట్టును స్ట్రెయిటెనింగ్ చేయించడం ప్రాణాంతకం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జుట్టు స్ట్రెయిటెనింగ్ పద్ధతిలో రసాయనాలు ఉపయోగించడం వల్ల యూటెరైన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు తేల్చారు. అమెరికాలో ఇలాంటి కేసులు నానాటికి పెరుగుతున్నట్లు గుర్తించారు.
అమెరికాలో ప్రమాదకరమైన గర్భాశయ క్యాన్సర్ కేసులు ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్నాయి. 15 ఏండ్ల క్రితం 39 వేల కేసులు ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య 66 వేలకు చేరింది. ఇందులో నల్లజాతి వారే ఎక్కువగా ఉన్నారు. కాగా, నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ జర్నల్‌లో ప్రచురించిన ఇటీవలి పరిశోధనాపత్రం ప్రకారం, రసాయన హెయిర్ స్ట్రెయిట్నర్లను క్రమం తప్పకుండా ఉపయోగించే మహిళలకు యూటెరైన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది.
పరిశోధకులు తెలిపిన అభిప్రాయం ప్రకారం, హెయిర్ స్ట్రెయిటెనింగ్ ఉత్పత్తులను ఏనాడూ వాడని మహిళలు 70 ఏండ్ల వయస్సులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 1.64 శాతంగా ఉంటుంది. అటువంటి ఉత్పత్తులను ఉపయోగిస్తున్న వారిలో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 4.05 శాతంగా ఉన్నదిది. అయితే, హెయిర్ కలరింగ్ డైతో క్యాన్సర్లకు సంబంధం లేదని పరిశోధకులు స్పష్టం చేశారు.
గర్భాశయ క్యాన్సర్ రావడానికి ముందు లక్షణాలు
నెలసరి కానప్పటికీ రక్తస్రావం జరుగుతుంది.
నెలసరి చాలా రోజుల వరకు కొనసాగుతుంది.
మెనోపాజ్ దశలో ఉన్నవారిలోనూ రక్తస్రావం కనిపిస్తుంది.
మూత్రవిసర్జన, శృంగారం సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది.
పెల్విక్ కండరాల్లో విపరీతమైన నొప్పి వస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

