Veg or Non-Veg | డాక్టర్ గారూ నమస్కారం. మేం ఈమధ్య శాకాహారులుగా మారాం. గతంలో మాంసం తినేవాళ్లం. మా బాబుకు ఆరేళ్లు. తనను శాకాహారిగా పెంచాలా, మాంసాహారిని చేయాలా? ఆరోగ్యానికి ఏది ఉత్తమం? మీ సలహా కావాలి.
ఓ పాఠకురాలు
ఆహారం పూర్తిగా వ్యక్తిగతమైంది. ఫలానా ఆహార విధానం మంచిదని కానీ, ఫలానా ఆహార విధానం చెడ్డదని కానీ చెప్పలేం. చాలా సందర్భాల్లో మన జీవనశైలి, పరిసరాలు, సమాజం, వారసత్వం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు.. అన్నీ కలిసి నిర్ణయిస్తాయి. ఏ ఆహార విధానం పరిమితులు ఆ ఆహార విధానానికి ఉన్నాయి.
శాకాహారంలో ప్రొటీన్స్, ఐరన్ తక్కువగా ఉంటాయి. పప్పులు, సోయా, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే.. ఆ లోపాన్ని సులభంగా అధిగమించవచ్చు. ఇక మాంసాహారం విషయానికొస్తే.. బలవర్ధకమైనదే అయినా మసాలాలు, నూనెలు గుప్పించడం వల్ల కొంత చెడు జరిగే ప్రమాదం కూడా ఉంది. మోతాదుకు మించిన మాంసాహారం దీర్ఘకాలంలో జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుందనీ చెబుతారు. మొత్తంగా.. రుచిని బట్టి కాకుండా, పోషకాలను బట్టి ఆహారాన్ని ఎంచుకోవాలి.
– డాక్టర్ ఉషారాణి సూపరింటెండెంట్ నిలోఫర్ పిల్లల దవాఖాన హైదరాబాద్