కారం కారంగా తింటే మజాగానే ఉంటుంది. కానీ, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. కడుపులో మంట (అల్సర్), జీర్ణ సమస్యలు, వాంతులు.. తదితర ఇబ్బందులు తలెత్తవచ్చు. కాబట్టి, కారంపై మితిమీరిన మమకారం పెంచుకోవద్దు.
పేగుల్లో అల్సర్లు
ఎర్రకారం ఎక్కువగా వాడితే పేగుల్లో అల్సర్లు వస్తాయి. కారంలోని అఫ్లాటోగ్జిన్ అనే పదార్థం అల్సర్లకు కారణం అవుతుంది. కారం మితిమీరితే కాలేయం దెబ్బతింటుంది, పెద్దపేగు క్యాన్సర్ కూడా రావచ్చు.
ఒత్తిడి
కారంలోని క్యాప్సైసిన్ అనే రసాయనం శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఒత్తిడి
తదితర సమస్యలు వస్తాయి.
దద్దుర్లు
ఎర్రకారం మితిమీరి తింటే నోట్లో పుండ్లు పడతాయి. గొంతులో మంట, వాంతులు ఇబ్బంది పెడతాయి. ఊపిరి తీసుకుంటున్నప్పుడు గొంతులో కష్టంగా ఉంటుంది.
జీర్ణ సమస్యలు
ఎర్ర కారంలోని క్యాప్సైసిన్ వల్ల పేగుల్లో అసౌకర్యంగా ఉంటుంది. గుండెల్లో మంట పుడుతుంది. జీర్ణ రసాలు మందగిస్తాయి. గ్యాస్, ఆకలి తగ్గడం తదితర సమస్యలు వెంటాడతాయి.
వాంతులు
ఎర్రకారం మోతాదు దాటితే.. కడుపులో తిప్పుతుంది. వాంతులు కావొచ్చు. కడుపునొప్పి, తల తిరగడం తదితర సమస్యలు వస్తాయి.