Pink Eye | కండ్ల కలక ఎలా వస్తుంది? ఇది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ వస్తే ఏం చేయాలి?
Pink Eye | కండ్ల కలక (పింక్-ఐ) కలకలం సృష్టిస్తోంది. వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు సంభవించడంతో వస్తున్నది. ఇదీ ప్రధానంగా వైరస్, బ్యాక్టీరియా,అలర్జీ కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అడెనో వైరస్ కారణంగా వస్తుండగా.. స్కూళ్లు, హాస్టళ్లు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో అధికమవుతున్నది.
Pink Eye | కండ్ల కలక (పింక్-ఐ) కలకలం సృష్టిస్తోంది. వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు సంభవించడంతో వస్తున్నది. ఇదీ ప్రధానంగా వైరస్, బ్యాక్టీరియా,అలర్జీ కారణంగా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. అడెనో వైరస్ కారణంగా వస్తుండగా.. స్కూళ్లు, హాస్టళ్లు, జన సమూహం ఉన్న ప్రాంతాల్లో అధికమవుతున్నది. వైరస్, బ్యాక్టిరియా ద్వారా వస్తే చూపు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలర్జీ ద్వారా వస్తే తేలికగా తగ్గిపోతుందని వైద్యులు తెలుపుతున్నారు. మందులు, ఐ డ్రాప్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిందంటున్నారు. ప్రధానంగా కంగారు పడాల్సిన పనిలేదని, వచ్చిన వారు ఐసోలేట్ అయితే సులభంగా కట్టడి చేయవచ్చని సూచిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వైద్యశాఖ అధికారులు అవగాహన కల్పిస్తూ.. నివారణకు చర్యలు తీసుకున్నారు.
మంచిర్యాల, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కండ్ల కలక (కంజంక్టివైటిస్) కేసులు అధికమవుతున్నాయి. కండ్లు వచ్చిన వారి కండ్లలోకి చూస్తే మనకు కూడా కండ్ల కలక వస్తుందని, ఇది వస్తే మంచిదని కండ్లు క్లీన్ అయితాయని అపోహలు, ప్రచారాలు ఉన్నాయి. వాస్తవానికి వర్షాకాలంలో వాతావరణంలో ఒక్కసారి వచ్చే మార్పులతోనే కండ్లకలక అధికంగా వ్యాపిస్తోంది. ఇది వైరస్, బ్యాక్టీరియా, అలర్జీ కారణంగా వస్తోందని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. వైరస్ లేదా బ్యాక్టీరియా కారణంగా వచ్చేది ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. దీనితో చూపు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలర్జీతో వచ్చేది రోగ నిరోధక వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ తీవ్రత చూపించినా తేలికగా తగ్గిపోతుంది. కొన్ని సార్లు రసాయనాల కారణంగా కూడా కళ్ల కలక రావచ్చు. అలాంటప్పుడు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. కొన్ని రోజులుగా జిల్లాలో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కండ్ల కలక రాకుండా నియంత్రించ వచ్చని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఎలా వస్తుందంటే..
కండ్ల కలక వచ్చిన వారి కండ్లలోకి చూస్తే ఇది వ్యాప్తి చెందదు. పింక్-ఐ వచ్చిన వారు ఉపయోగించిన వస్తువులను మనం ఉపయోగించినా, వారు తాకిన వాటిని మనం తాకినా.. వారితో కరచాలనం చేసినా.. చేతులు శుభ్రం చేసుకోవాలి. అలా చేతులు కడుక్కోకుండా అలానే మన కండ్లను తుడుచుకోవడం, తాకడం చేస్తే వస్తుంది. కాంటాక్ట్ లెన్స్ వాడే అలవాటున్న వారు వాటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం కారణంగా వస్తోంది. స్కూళ్లు, జన సమూహాల్లో ఏ ఒక్కరికి వైరస్ వచ్చినా మిగిలిన వారికి వేగంగా వ్యాపిస్తోంది.

ఈ లక్షణాలుంటే కండ్ల కలక వచ్చినట్లే..
☞ ఒక కన్ను లేదా రెండు కండ్లు ఎర్రగా మారడం
☞ కండ్లలో మంట, నొప్పి లేక దురద
☞ కనురెప్పలు వాపురావడం
☞ కంటి రెప్పలు అతుకున్నట్లు అనిపించడం(ఉదయం నిద్రలేచే సరికి ఎక్కువ ఊసులతో కను రెప్పులు అతుక్కొని ఉండడం)
☞ వెలుతురును చూడలేక పోవడం. కళ్ల నుంచి నీరు, చిక్కటి ద్రవం కారడం
☞ బ్యాక్టీరియా కారణంగా కండ్ల కలక వస్తే కళ్లలో నుంచి చీము వచ్చే అవకాశం ఉంది. అలా వచ్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చూపు కోల్పోవచ్చు.
☞ కండ్ల కలకకు కారణమయ్యే వైరస్‌తో సాధారణ జలుబు వస్తుంది. చిన్న పిల్లలకు జ్వరం కూడా రావచ్చు.
వచ్చిన వారికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి
☞ కండ్ల కలక వచ్చిన వారు కండ్లు నలవడం, కంట్లో చేతులు పెట్టడం చేయొద్దు
☞ శుభ్రమైన టిష్యూ లేక కర్చీఫ్ వాడి కండ్లు తుడుచుకోవాలి. వేడి నీళ్లలో వాటిని శుభ్రం చేసుకోవాలి
☞ నల్లటి అద్దాలు ధరించాలి. తద్వారా వైరస్ వేరే వారికి వ్యాపించకుండా ఉంటుంది.
☞ ఐసోలేట్ అయిపోవాలి. వైరస్ వచ్చిన వారు వేరు గదిలో ఉండడం ద్వారా ఇంట్లో మిగిలిన వారికి రాకుండా చూసుకోవచ్చు.
☞ కండ్ల కలక వచ్చిన వారు వాడే టవల్స్, కర్చీఫ్ వేరే వారు వాడకూడదు.
☞ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు వారిని స్కూల్‌కు పంపకుండా, వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నించాలి.
☞సొంత ప్రయోగాలు, ఇంటి వైద్యంతో ఆలస్యం చేయకుండా సమస్య చిన్నగా ఉన్నప్పుటే వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటే మంచిది
మందులు అందుబాటులో ఉన్నాయి..
వర్షాకాలంలో వచ్చే కండ్ల కలకకు ప్రధాన కారణం అడినోవైరస్. వాతావరణ మార్పుల కారణంగా ఇది వస్తోంది. ఒకరి నుంచి మరొకరి వ్యాపిస్తోంది. ఇప్పుడు వచ్చిన కేసుల్లో ఎక్కువ శాతం స్కూళ్లు, హాస్టళ్లలో వస్తున్నవే ఉన్నాయి. వచ్చిన వెంటనే వేరుగా ఉండడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రం చేసిన టవల్స్, కర్చీప్ వాడాలి. అద్దాలు పెట్టుకోవడం మంచిది. లేని పక్షంలో యాంటిబయోటిక్ వాడాలి. కండ్ల కలకకు సంబంధించి పీహెచ్‌సీల వైద్యులు రోజు హాస్టల్స్ విజిట్ చేయాలని ఆదేశించాం. వారికి కావల్సిన మెడిసిన్ కూడా అందుబాటులో ఉంచాం. కావల్సినన్ని ఐ డ్రాప్స్ అందుబాటులో ఉంది. అపోహలు నమ్మొద్దు. రాకుండా కట్టడి చేయడం అన్నిటికంటే ఉత్తమం.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్‌వో, మంచిర్యాల
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
Psoriasis | సోరియాసిస్, ఎగ్జిమా.. రెండింటి మధ్య తేడాలేమిటి.. ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి..?
Sharukh Khan | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. ‘కింగ్’ నుంచి తొలి పాట విడుదల, రొమాన్స్‌తో పాటు యాక్షన్ అదుర్స్
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

