బాల్యానికి.. కీళ్ల నొప్పులు!
బడి వయసు బాలబాలికల్లో ముప్పై శాతానికిపైగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది.
బడి వయసు బాలబాలికల్లో ముప్పై శాతానికిపైగా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో పిల్లల్లో కీళ్ల నొప్పుల లక్షణాలు, చికిత్సపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నారులలో కనిపించే ప్రధాన సమస్యలివి.. గ్రోయింగ్ పెయిన్స్ మూడు నుంచి ఏడేండ్ల చిన్నారుల్లో మోకాళ్లు, కాళ్లు, తల, ఛాతీలో నొప్పిగా, పొడుస్తున్నట్లుగా ఉండే సమస్యను ‘గ్రోయింగ్ పెయిన్’గా పిలుస్తారు. ఇది సాయంత్రం లేదా రాత్రివేళల్లో తలెత్తి.. తెల్లారేసరికి మాయమైపోతుంది.
జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కీళ్లలో నొప్పి లేదా వాపు ఉంటే.. ‘జువెనైల్ ఇడియోపతిక్ ఆర్థరైటిస్’ అంటారు. ఇది పిల్లల కదలికలు, శారీరక పటుత్వంపై ప్రభావం చూపిస్తుంది. సమస్యను సకాలంలో గుర్తించి, చికిత్స అందించకపోతే.. ఎముకల పెరుగుదల మీద దుష్ప్రభావం పడుతుంది. తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
ల్యుకేమియా
రక్తం, అస్థిమజ్జకు వచ్చే క్యాన్సర్ ఇది. ఈ వ్యాధి ప్రధానంగా ఎముకలు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది.
లూపస్
రోగ నిరోధక శక్తి క్షీణతకు సంబంధించిన ఆటోఇమ్యూన్ రుగ్మత ఇది. చాలావరకు, అమ్మాయిల్లో టీనేజ్లో వస్తుంది. జ్వరం, వెంట్రుకలు రాలిపోవడం, కీళ్లనొప్పులు, వాపులు, అలసట, చర్మం, ముక్కు మీద దద్దుర్లు ప్రధాన లక్షణాలు.
లైమ్ డిసీజ్
పశువులను పీడించే పిడుదుల నుంచి వ్యాపించే బొరేలియా బర్గ్డార్ఫెరి అనే బ్యాక్టీరియా ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ ఇది. పిడుదులు కుట్టడం ద్వారా పిల్లలకు వ్యాపిస్తుంది. కీళ్లనొప్పులు, అలసట, జ్వరం, వణుకు, ముఖ పక్షవాతం (ఫేషియల్ పెరాలసిస్) ప్రధాన లక్షణాలు.
ఇవీ లక్షణాలు..
- కుంటుతున్నట్టు నడవడం.
- దద్దుర్లు.
- తగ్గని జ్వరం.
- కీళ్ల వాపు లేదా పట్టేసినట్లు ఉండటం.
- ఆయాసం.
- హఠాత్తుగా బరువు తగ్గడం.
- ఆకలి మందగించడం.
రోగ నిర్ధారణ- చికిత్స
పరిస్థితి తీవ్రతను బట్టి డాక్టర్లు రక్త పరీక్షలు చేయిస్తారు. ఎక్స్రే తీయిస్తారు. ఈ నొప్పులకు ఎసిటామినాఫెన్ లేదా ఐబుప్రొఫెన్ లాంటి పెయిన్ కిల్లర్లు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. కాలి, తొడ కండరాలను సాగదీసే వ్యాయామాలను చేయిస్తారు. నొప్పిగా ఉన్న కండరాల దగ్గర మృదువుగా మర్దన చేసినా కొంత ఉపశమనం లభిస్తుంది. పడుకునే ముందు వేడి నీటితో స్నానం చేయిస్తే పిల్లలకు హాయిగా అనిపిస్తుంది. కీళ్ల నొప్పులు పిల్లల ఎదుగుదలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వయసుకు తగిన ఎత్తు ఉండరు. కండరాలు బలహీనపడతాయి. శారీరక పటుత్వం తగ్గిపోతుంది, కదలికల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. రుగ్మత లక్షణాలను తొలిదశలోనే గుర్తించడం ఉత్తమం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

