UTI problems | యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షనా..? జీవనశైలి మార్పులతో నిరోధించుకో..!
UTI problems | యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు సర్వసాధారణ సమస్యగా మారాయి. మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా యూటీఐని నిరోధించుకునే అవకాశాలు ఉన్నాయి.
UTI problems | మూత్రనాళంలోని ఏదైనా ప్రాంతంలోకి హానికరమైన బ్యాక్టీరియా ప్రవేశించినప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ గురవుతుంటారు. మహిళల్లో ఈ సమస్య సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో పొత్తి కడుపులో మంట, మూత్రం రంగు మారటం, వెంటవెంటనే మూత్రానికి వెళ్ళటం వంటి లక్షణాలు కనపడతాయి. వెన్నెముక, పొత్తికడుపు కింది భాగంలో నొప్పి కనిపిస్తుంది. పరిశుభ్రత లోపించడం అనేది ప్రధాన కారణమైనప్పటికీ యాంటీ బయోటిక్స్ అధికంగా వాడటం, మూత్రపిండంలో రాళ్లు వంటి వాటితో కూడా యూటీఐ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రకాల జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా యూటీఐ సమస్యను నిరోధించవచ్చునని సెలవిస్తున్నారు వైద్య నిపుణులు.
మోర్ వాటర్
ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారి శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఎక్కువ మొత్తంలో నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి బ్యాక్టీరియాకు తక్కువ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అలాగే ట్రాక్ట్‌లో బ్యాక్టీరియా ఉండకుండా ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు పంపుతుంది. అందుకని రోజులో కనీసం మూడు లీటర్లకు తక్కువ కాకుండా ద్రవాలు తీసుకోవాలి. కొబ్బరి నీరు మరీ మంచిది. బియ్యం నీరు ఇన్ఫెక్షన్ను తగ్గించేందుకు సాయపడుతుంది.
హై ఫైబర్ డైట్
యూటీఐ సమస్యతో బాధపడుతున్న వారు హై ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడంపై దృష్టిసారించాలి. అధిక ఫైబర్ ఫుడ్స్ సహజంగా మూత్రాశయం, మూత్రనాళాలను శుభ్రపరుస్తుంది. తద్వారా యూటీఐ సమస్యను నిరోధించుకోవచ్చు. అలాగే మలబద్దకం సమస్యను కూడా నివారించుకోవడంలో సాయపడతాయి. నిత్యం దాదాపు 25 గ్రాముల ఫైబర్ కలిగిన పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు తినడం అలవాటు చేసుకోవాలి.
రెగ్యులర్ ఎక్సర్సైజెస్
రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ద్వారా యూటీఐ సహా అనేక రకాల ఆరోగ్య పరిస్థితులను నివారించుకోవచ్చు. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా యూటీఐ ప్రమాదాన్ని తగ్గించేందుకు సాధారణ వ్యాయామాల్ని ఎంచుకోవాలి. శరీర ఉష్ణోగ్రత పెరిగిన సందర్భాల్లో ఈ సమస్య కూడా పెరుగుతుంది. క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలతో మూత్రాశయం బలపడి మూత్ర విసర్జన చేసే సమయాన్ని తగ్గిస్తుంది.
ప్రాబ్లమెటిక్ ఫుడ్స్
కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు మూత్రనాళానికి చికాకు కలిగిస్తుంటాయి. ఇవి కూడా యూటీఐకి కారణమవుతుంటాయి. యూటీఐని ప్రేరేపించే ఆహారాలు, పానీయాలను దూరం పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా మసాలా ఆహారాలు, సిట్రస్ పండ్లు, కెఫిన్, బీర్, రెడ్ వైన్, ఇతర ఆల్కహాల్ పానీయాలను దూరం పెట్టాలి. అలాగే మూత్రనాళాన్ని చికాకు పెట్టే అధిక స్థాయి యాసిడ్ కంటెంట్ ఉన్న టమాట వంటి ఆహారాలను తీసుకోకుండా జాగ్రత్తపడాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

