Chai | అతిగా టీ తాగితే అనర్ధాలివే..!
గరం గరం ఛాయ్‌ను (Chai) అందునా వర్షాకాలంలో ఎంజాయ్ చేసేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అన్ని సీజన్లలో అన్ని రీజన్లకూ మనకు టీ ఉండాల్సిందే.
న్యూఢిల్లీ : గరం గరం ఛాయ్‌ను (Chai) అందునా వర్షాకాలంలో ఎంజాయ్ చేసేందుకు అందరూ ఇష్టపడుతుంటారు. అన్ని సీజన్లలో అన్ని రీజన్లకూ మనకు టీ ఉండాల్సిందే. మసాలా ఛాయ్ నుంచి గ్రీన్ టీ వరకూ ఎన్నో రకాల టీలను తాగుతుంటారు. టీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలూ చేకూరతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను దూరం చేసి రోగనిరోధక వ్యవస్ధను బలోపేతం చేస్తుంది.
అయితే టీని అతిగా తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు అటుంచి అనారోగ్యాల బారిన పడే ముప్పుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేఫిన్, టానిన్లు అధికంగా ఉండటం వల్ల టీ ఎక్కువగా తాగితే శరీరం ఐరన్‌ను సంగ్రహించే శక్తి సన్నగిల్లడంతో పాటు నిద్రలేమికీ దారితీస్తుంది. టీ అధికంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ తగినంతగా ఉండదు. మీరు శాకాహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
టీలో టానిన్లు జంతు సంబంధ ఆహారం కంటే మొక్కల ఆహారం నుంచే ఐరన్‌ను సంగ్రహించడాన్ని అధికంగా నిరోధిస్తాయి. ఇక టీలో కెఫిన్ అదికంగా ఉండటంతో ఎక్కువగా టీ తాగేవారిలో నిద్ర లేమి వెంటాడుతుంది. నిద్రలేమి వల్ల అలసట, మెమరీ తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి పలు సమస్యలు ఎదురవుతాయి. నిద్రలేమి దీర్ఘకాలం కొనసాగితే జీవన శైలి వ్యాధుల ముప్పూ పెరుగుతుంది. టీ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండెలో మంట, తలతిరగడం, తలనొప్పి వంటి పలు ఇబ్బందులు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Read More :
Health Tips | మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఏడు రకాల ఆహారపదార్థాలు మీ మెనూలో ఉండాల్సిందే
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

