Cancer | కూల్డ్రింక్స్ తాగితే క్యాన్సర్ ముప్పు.. మంచినీళ్లు తాగడమే బెటర్ అంటున్న డబ్ల్యూహెచ్వో!
Cancer | కూల్డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చక్కెరకు బదులుగా శీతల పానీయాల్లో వినియోగించే స్వీట్నర్ పదార్థం ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. కానీ ఇది వరకే వైద్య నిపుణులు ఆమోదించిన మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించింది.
Cancer | న్యూఢిల్లీ, జూలై 14: కూల్డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చక్కెరకు బదులుగా శీతల పానీయాల్లో వినియోగించే స్వీట్నర్ పదార్థం ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చిచెప్పింది. కానీ ఇది వరకే వైద్య నిపుణులు ఆమోదించిన మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం లేదని వెల్లడించింది. కోకాకోలా, డైట్ కోక్, సోడా, చూయింగ్ గమ్లలో వినియోగించే ఆస్పర్టేమ్ ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు చెందిన రెండు సంస్థలు శుక్రవారం నివేదికను వెలువరించాయి. ఫ్రాన్స్లోని లైయన్ వేదికగా పని చేస్తున్న అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ), జెనీవా కేంద్రంగా పని చేస్తున్న డబ్ల్యూహెచ్వో ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ జాయింట్ కమిటీ ఆన్ ఫుడ్ అడిటివ్స్ (జేఈసీఎఫ్ఏ) దీనిపై పరిశోధనలు చేశాయి.
నీరే సురక్షితం…
ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన న్యూట్రిషన్ హెడ్ ఫ్రాన్సెస్కో బ్రాన్సా ఈ అధ్యయన నివేదికను శుక్రవారం విడుదల చేశారు. పానీయాలను ఎంపిక చేసుకునే వినియోగదారులు ఆస్పర్టేమ్ లేదా స్వీట్నర్లను పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు. ‘స్వీట్నర్ లేదా ఆస్పర్టేమ్ కలిపిన శీతల పానీయాల్లో దేన్ని తాగాలని వినియోగదారులు సంశయిస్తుంటారు. ఆ రెండింటి బదులు నీరు తాగాలని వినియోగదారులకు సూచిస్తున్నా’ అని ఆయన తెలిపారు. తొలుత ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమని శుక్రవారం ఐఏఆర్సీ ప్రకటించింది.
‘అమెరికా, యూరప్లో గతంలో మూడు అధ్యయనాలు చేశాం. ఆస్పర్టేమ్ వినియోగం వల్ల హెపాటోసెల్లర్ కార్సినోమా అనే కాలేయ సంబంధిత క్యాన్సర్ వస్తుంది. గతంలో 2016లోనే దీనిపై వినియోగదారులకు సూచించాం. ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమేనని తాము వెలువరించిన నివేదికలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆస్పర్టేమ్లో క్యాన్సర్కు కారకమవుతున్న రసాయనాలు ఉన్నాయనడానికి పరిమిత సంఖ్యలో ఆధారాలు ఉండటమే దీనికి కారణం. గతంలో జంతువులపై చేసిన అధ్యయనంలోనూ ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమేనని తేలింది’ అని ఐఏఆర్సీ పేర్కొంది. ఆస్పర్టేమ్ క్యాన్సర్ కారకమో కాదో తేల్చి చెప్పడానికి దీనికి సంబంధించిన నిపుణులకు తమ నివేదిక ఓ పిలుపులాంటిదని ఐఏఆర్సీ చీఫ్ మేరీ షూబర్ బెరిగాన్ తెలిపారు.
రోజుకు 40 ఎంజీ/కిలో…
జేఈసీఎఫ్ఏ దీనిపై మరోలా నివేదికను వెలువరించింది. ఆస్పర్టేమ్ క్యాన్సర్కు కారకమవుతున్నదనటానికి సరైన ఆధారాలు లేవని తెలిపింది. నిపుణులు ఆమోదించిన మోతాదులో ఆస్పర్టేమ్ తీసుకుంటే ప్రమాదం ఉండదని పేర్కొంది. రోజుకు 40 ఎంజీ/కిలో ఆస్పర్టేమ్ తీసుకుంటే ప్రమాదమేమీ కాదని చెప్పింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Cancer
- cold drinks
- Health
- WHO
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

