Banana | ఉదయం ఖాళీ కడుపుతో అరటి పండును తినవచ్చా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
అత్యంత పోషకమైన, శక్తితో నిండిన ఆహారాల్లో అరటిపండు ఒకటి. అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
Banana | అత్యంత పోషకమైన, శక్తితో నిండిన ఆహారాల్లో అరటిపండు ఒకటి. అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దీనిలో పొటాషియం, విటమిన్ బి6, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. శక్తిని అందించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, రక్తపోటును తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా అరటిపండు మనకు సహాయపడుతుంది. ఉదయం పూట ఆహారంలో భాగంగా కొందరు పండ్లను తీసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవచ్చా లేదా అన్న సందేహం కలుగుతూ ఉంటుంది. అసలు ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవచ్చా లేదా, ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్త పోటు అదుపులో..
ఉదయం మేల్కొన్న తరువాత శరీరం రోజును ప్రారంభించడానికి సిద్దంగా ఉంటుంది. రోజును ప్రారంభించే ముందు ఉదయం పూట మనం తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం మన శక్తి స్థాయిలను, మన శరీర జీవక్రియలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అలాగేరాత్రంతా ఉపవాసం ఉన్న తరువాత శరీరానికి శక్తిని అందించడానికి, హైడ్రేట్ చేయడానికి పోషకాలు చాలా అవసరం. కనుక ఉదయం మనం తీసుకునే ఆహారం ఆకలిని తీర్చడంతో పాటుగా జీవక్రియలను మెరుగుపరిచేదిగా, శక్తిని అందించేదిగా ఉండాలి. కనుక ఉదయం పూట అరటిపండ్లను తీసుకోవడం వల్ల ఆకలి తీరడంతో పాటు శరీరానికి కావల్సిన శక్తి, పోషకాలు అన్నీ అందుతాయి. ఖాళీ కడుపున అరటి పండ్లను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. రక్తపోటు స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవడం ప్రయోజనకరంగానే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు.
అందరికీ సరిపోదు..
ఖాళీ కడుపుతో అరటిపండును ఉదయం పూట తీసుకోవడం అందరికి సరిపోదని వారు సూచిస్తున్నారు. అరటిపండ్లను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యం తగ్గుతుంది. దీంతో శరీరం మొత్తం శక్తి స్థాయిలు కూడా తగ్గుతాయి. రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. అలాగే అరటిపండులో క్యాలరీలు తక్కువగా ఉన్నప్పటికీ దీనిని తిన్న కొన్ని నిమిషాలకే ఆకలి పెరుగుతుంది. దీని వల్ల మనం అతిగా తినే అవకాశం కూడా ఉంది. తద్వారా శరీర బరువు కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా అరటిపండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కనుక ఇది కొందరిలో కడుపు నొప్పికి కారణమవుతుంది. ఫైబర్ సాధారణ మోతాదులో తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఖాళీ కడుపుతో తీసుకునే ఫైబర్ కొందరిలో కడుపులో చికాకు, ఉబ్బరం గ్యాస్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. కనుక సున్నితమైన జీర్ణాశయం ఉన్న వారు ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోకపోవడమే మంచిది.
ఈ విధంగా ఉదయం పూట ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలతో పాటు దుష్ప్రభావాలు కూడా ఉంటాయని ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని మన శరీరాన్ని బట్టి మనమే నిర్ణయించుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

