సకాలంలో గుర్తిస్తే రొమ్ము క్యాన్సర్ నియంత్రణ సాధ్యం
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది రొమ్ము క్యాన్సర్. అవగాహన లేకపోవడంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దాదాపు 60 శాతానికి పైగా రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్ల దగ్గరికి పరుగు తీస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందిస్తే వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు.
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఎక్కువగా కనిపించేది రొమ్ము క్యాన్సర్. అవగాహన లేకపోవడంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దాదాపు 60 శాతానికి పైగా రోగులు వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్ల దగ్గరికి పరుగు తీస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందిస్తే వ్యాధిని పూర్తిగా తగ్గించవచ్చు. అయితే ప్రారంభ దశలో కణితి పరిమాణం చిన్నగా ఉండటం వల్ల ఎలాంటి లక్షణాలు బయటపడవు. రొమ్ములో నొప్పిగాని, వాపుగాని ఉండదు. చిన్నపాటి గడ్డలా ఉంటుంది. దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అది పెద్దదైనప్పుడు నొప్పి, చేతికి గడ్డ తగలడం వంటి లక్షణాలు బయటపడతాయి.
రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు:
వంశపారంపర్యం
ఆలస్యంగా పెళ్లిళ్లు
పిల్లలకు పాలు ఇవ్వకపోవడం
చిన్న వయసులోనే రజస్వల కావడం
55 ఏళ్లు నిండినా నెలసరి రావడం
లక్షణాలు:
రొమ్ము పరిమాణంలో మార్పులు
చనుమొన నుంచి రక్తస్రావం
రొమ్ముపై చెయ్యి పెట్టినప్పుడు గడ్డ స్పష్టంగా తగలడం
రొమ్ము పరిమాణం పెరిగి నొప్పి కలగడం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే ఆ కుటుంబంలోని మహిళలు 20 ఏళ్ల వయసు నుంచి స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవాలి. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా అల్ట్రాసౌండ్ మమోగ్రామ్ వంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల కణితి ప్రారంభ దశలో చిన్నగా ఉన్నప్పుడే
గుర్తించవచ్చు.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు:
మమోగ్రామ్
అల్ట్రాసౌండ్
టిష్యూ స్కాన్
బోన్ స్కాన్
ఎంఆర్ఐ
ఎంఆర్ స్పెక్ట్రోస్కోపి
చికిత్స విధానాలు:
సాధారణంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్సనే కీలకం. అయితే ఈ చికిత్సలో భాగంగా జరిపే సర్జరీ వల్ల రొమ్ము తీసేయాల్సి వస్తుంది. దీనివల్ల మహిళలకు సమాజపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులు ఉండకుండా ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చాయి. రొమ్ము ఆకారంలో ఎలాంటి తేడా లేకుండా ఉండేందుకు ‘ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ’ అందుబాటులో ఉంది. రెండు వక్షోజాలు ఒకే పరిమాణంలో ఉండేందుకు, ఆకారంలో ఎలాంటి తేడా లేకుండా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జన్ సహకారంతో సర్జరీ చేస్తారు.
కణితి పరిమాణం ఆధారంగా సర్జరీ విధానం:
ఇక్కడ రొమ్ము పరిమాణం, దానిలోని కణితి పరిమాణంపై సర్జరీ ఆధారపడి ఉంటుంది. కణితి పరిమాణం 2 సెం.మీల కంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే లంపెక్టమీ చేస్తారు. కణితి పరిమాణం 5 సెం.మీల కంటే పెద్దగా ఉన్నప్పుడు రొమ్మును పూర్తిగా తొలగించాల్సి వస్తుంది. అందుకోసం మాస్టెక్టమి చేస్తారు. రొమ్మును పూర్తిగా తొలగించినప్పుడు బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్, కృత్రిమ రొమ్ము ఆకృతిని ఇవ్వడం జరుగుతుంది. కృత్రిమ రొమ్ము కోసం శరీరంలోని ఇతర భాగాలు, పొట్ట, పిరుదులు వంటి భాగాల నుంచి కణజాలాన్ని, కండరాన్ని తీసి తొలగించిన రొమ్ము ప్రదేశంలో అమరుస్తారు. రోగి కోలుకునే సమయం శస్త్రచికిత్స పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స తరువాత శ్వాస తీసుకోవడం, శారీరక కదలికలు వంటివి ఫిజియోథెరపిస్టు సలహా మేరకు చేయాల్సి ఉంటుంది. సర్జరీ తరువాత శరీర ఉష్ణోగ్రత పెరిగి, సర్జరీ జరిగిన రొమ్ము ఎర్రగా మారటం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తే అక్కడ ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు గుర్తించాలి. వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. సర్జరీ తరువాత అవసరం మేరకు కీమో, రేడియేషన్, టొమాక్సఫెన్ వంటి హార్మోన్ థెరపీని అందిస్తారు. చికిత్స తరువాత కూడా క్రమం తప్పకుండా చెకప్స్ చేయించుకుంటూ ఉండాలి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
98490 22121
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

