New Study | ఎక్కువసేపు ఆ పనిచేస్తున్నారా? అయితే, ఊబకాయం తప్పదు!
చిన్నపిల్లలనుంచి మొదలుకొని, పెద్దల దాకా ప్రతిఒక్కరూ రోజులో అధిక సమయం టీవీ, మొబైల్, ల్యాప్టాప్కే అతుక్కుపోతున్నారు. గ్యాడ్జెట్ లేనిదే రోజువారీ జీవనం సాగడం లేదు. అయితే, ఇలాంటి వారికి ఊబకాయంతోపాటు మానసిక సమస్యలు తప్పవని తాజా అధ్యయనంలో తేలింది. అధిక స్క్రీన్ టైం వల్ల వారు బ్లూ లైట్‌కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారని, దీంతో ఊబకాయం, మానసిక సమస్యలతోపాటు త్వరగా వృద్ధాప్య లక్షణాలు వస్తున్నాయని పరిశోధకులు తేల్చారు.

ఈ అధ్యయనాన్ని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించారు. పండు ఈగలపై అధ్యయనం నిర్వహించారు. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్ల నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల చర్మం, కొవ్వు కణాల నుంచి సెన్సరీ న్యూరాన్ల వరకు శరీరంలోని విస్తృత శ్రేణి కణాలపై హానికరమైన ప్రభావం పడుతుందని గుర్తించినట్టు పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జాడ్విగా గిబుల్టోవిచ్ తెలిపారు. బ్లూ లైట్ మన ప్రాథమిక జీవసంబంధమైన విధులపై ప్రభావం చూపుతుందని కనుగొన్నామన్నారు. ఈగలు, మానవుల కణాలలో సిగ్నలింగ్ రసాయనాలు ఒకే విధంగా ఉంటాయని గిబుల్టోవిచ్ వివరించారు. ఈ అధ్యయన ఫలితాలు ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్‌లో ప్రచురితమయ్యాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి