Oral Health | చిగుళ్ల నుంచి రక్తం కారుతోందా? అయితే ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లే !!
Oral Health | పళ్లు తోముకుంటున్నప్పుడు, ఉమ్మేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నదా? అయితే, చిగుళ్ల అనారోగ్యానికి అదో సూచన కావచ్చు అంటున్నారు దంతవైద్యులు. దీనికి అనేక కారణాలు..
Oral Health | పళ్లు తోముకుంటున్నప్పుడు, ఉమ్మేస్తున్నప్పుడు చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నదా? అయితే, చిగుళ్ల అనారోగ్యానికి అదో సూచన కావచ్చు అంటున్నారు దంతవైద్యులు. దీనికి అనేక కారణాలు..
జన్యుపరమైన కారణాల వల్ల కూడా చిగుళ్లు పలుచగా ఉంటాయి. అలాంటివారు సమస్యల బారినపడే అవకాశం ఎక్కువ. నిజానికి, చిగుళ్ల రక్త స్రావానికి ఓ సాధారణ కారణం.. జింజివైటిస్. చిగుళ్లపై పాచి పేరుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. దీర్ఘకాలం పట్టించుకోకపోతే అది ‘పెరియోడాంటైటిస్’కు దారితీస్తుంది. దీంతో, చిగుళ్ల లోలోతుల్లో పేరుకుపోయిన బ్యాక్టీరియా దంతాల నిర్మాణాన్ని దెబ్బతీస్తుంది. ఊడిపోవచ్చు కూడా! నోటి అపరిశుభ్రత, ధూమపానం వల్ల సైతం ఈ ఇబ్బంది తలెత్తవచ్చు.
ఇతర కారణాలు
హార్మోన్లలో మార్పులు
రజస్వల కావడం, గర్భధారణ, మెనోపాజ్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల చిగుళ్ల వాపు రావచ్చు. ఫలితంగా రక్తం రావచ్చు.
మందులు
రక్తం పలుచబడేందుకు, అధిక రక్తపోటు నియంత్రణకు తీసుకునే కొన్ని రకాల ఔషధాలు కూడా చిగుళ్ల వాపునకు, రక్తస్రావానికి దారితీస్తాయి.
మధుమేహం
నోటిలో సమృద్ధిగా ఊరే లాలాజలం చిగుళ్లను ఇబ్బందిపెట్టే బ్యాక్టీరియాను కడిగేస్తుంది. మధుమేహ నియంత్రణ కోసం వాడే కొన్నిరకాల మందుల కారణంగా కూడా లాలాజలం ఊట తగ్గిపోవచ్చు.
గట్టిగా బ్రష్ చేయడం
దంతాలు మెరిసిపోవాలనే తపనతో చాలామంది బండగా బ్రష్ చేసుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. మెత్తటి బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌తో సున్నితంగా తోముకోవడం మంచిది.
విటమిన్ లోపాలు
విటమిన్-సి, విటమిన్-కె లోపానికి ఇదో సూచిక. విటమిన్-సి లోపం వల్ల తలెత్తే స్కర్వీ వ్యాధి నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఇలా అడ్డుకుందాం..
రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. పళ్ల మధ్య, చిగుళ్లలో పోగైన పాచిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి (ఫ్లాసింగ్). ఏడాదిలో రెండుసార్లు దంతవైద్యుడి దగ్గర నోరు శుభ్రం చేయించుకోవాలి. అయినా సమస్య తగ్గకపోతే చికిత్సకు సిద్ధపడాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Gums
- Health
- Health news
- Oral health
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

