స్ట్రోక్ నుంచి కాపాడే బీఫాస్ట్
ఉరుకుల పరుగుల జీవితంలో ‘బ్రెయిన్ స్ట్రోక్' అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా మారింది. 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తేల్చింది.
ఉరుకుల పరుగుల జీవితంలో ‘బ్రెయిన్ స్ట్రోక్’ అనేది ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణంగా మారింది. 25 ఏళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడే అవకాశం ఉందని వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ తేల్చింది. మెదడు సక్రమంగా పనిచేయాలంటే ఆక్సిజన్, పోషకాలు అత్యంత అవసరం. ఏదైనా కారణం వల్ల మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయినా, మెదడులో రక్తస్రావం జరిగినా దానిని ‘స్ట్రోక్’ అంటారు. రక్త ప్రసరణ కొద్ది నిమిషాల పాటు ఆగినా మెదడులోని కణాలు చనిపోతుంటాయి. అందుకే స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది. స్ట్రోక్ లక్షణాలను సామాన్యులు కూడా సులభంగా గుర్తించేందుకు ‘BE FAST’ అనే సూత్రాన్ని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఒకో అక్షరానికి ఒకో అర్థం ఉంది. వాటి గురించి తెలుసుకుందాం…
B (బ్యాలెన్స్): అకస్మాత్తుగా నడకలో తడబాటు రావడం, శరీర స్థితిని కోల్పోవడం లేదా విపరీతంగా తల తిప్పుతున్నట్టుగా అనిపించడం.
E (కళ్లు): హఠాత్తుగా చూపు మందగించడం, వస్తువులు రెండుగా (డబుల్ విజన్) కనిపించడం లేదా పూర్తిగా చూపు పోవడం.
F (ఫేస్): ముఖం ఒకవైపునకు పకకు పోయినట్లు అవ్వడం లేదా నవ్వినప్పుడు ముఖంలో అసమానతలు కనిపించడం.
A (ఆర్మ్): చేతులు బలహీనం కావడం. ఒక చేతిని పైకి ఎత్తలేకపోవడం లేదా మొద్దుబారిపోయినట్లు అనిపించడం.
S (స్పీచ్): మాట మొద్దుగా, అస్పష్టంగా రావడం లేదా ఇతరులు చెప్పేది అర్థం చేసుకోలేక పోవడం.
T (టైమ్): పై లక్షణాల్లో ఏ ఒకటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
స్ట్రోక్ లక్షణాలు కనిపించినప్పుడు చాలామంది చేసే అతిపెద్ద తప్పు.. సొంతంగా కారు లేదా బైక్ నడుపుకొంటూ హాస్పిటల్‌కు వెళ్లడం. అలా చేయడం అస్సలు మంచిది కాదు. స్ట్రోక్ వచ్చినప్పుడు రోగిని ఒంటరిగా దవాఖానకు పంపకూడదు. వెంటనే అంబులెన్స్‌ను పిలవడం ఉత్తమం. అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రిలోని ‘స్ట్రోక్ టీం’కు ముందే సమాచారం అందించడంతో అంబులెన్స్‌లోనే ప్రాథమిక చికిత్స మొదలవుతుంది. దీనివల్ల రోగి హాస్పిటల్‌కు చేరగానే తక్షణ చికిత్స అందే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

