సంతానలేమితో బాధపడుతున్నారా… ఆయుర్వేదంలోని ఈ మూలికలను వాడి చూడండి!
శరీరంలో దోషాల మధ్య అసమతుల్యత కారణంగా వంధ్యత్వం వస్తుందని విశ్లేషిస్తుంది భారతీయ వైద్య విధానమైన.. ఆయుర్వేదం. ఈ దోషాలను సమతూకంలో ఉంచగలిగితే సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేదం భరోసా ఇస్తున్నది.
సంతాన యోగ్యత లేకపోవడాన్ని వంధ్యత్వంగా పేర్కొంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రతి ఆరుగురిలో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారని అంచనా. విశ్వవ్యాప్తంగా.. పెద్దల జనాభాలో ఇలాంటి వారి శాతం 17.5 దాకా ఉంటుంది. అయితే, వంధ్యత్వం సహా దంపతులు ఎదుర్కొనే అనేక సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కారాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.
శరీరంలో దోషాల మధ్య అసమతుల్యత కారణంగా వంధ్యత్వం వస్తుందని విశ్లేషిస్తుంది భారతీయ వైద్య విధానమైన.. ఆయుర్వేదం. ఈ దోషాలను సమతూకంలో ఉంచగలిగితే సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేదం భరోసా ఇస్తున్నది. వంధ్యత్వాన్ని నివారించి, దంపతులకు సంతానయోగం ప్రసాదించడానికి ఆయుర్వేదంలో కొన్ని అమూల్య మూలికలు ఉన్నాయి. అండాల అభివృద్ధి, అండాల నాణ్యతలో మెరుగుదల, సమయానికి అండాల విడుదల, అండాల ఫలదీకరణ, వీర్యకణాల సంఖ్య, నాణ్యత పెంచడం, బీజావాపం (ఇంప్లాంటేషన్), ఆరోగ్యకరమైన గర్భధారణ మొదలైన వాటిలో ఇవన్నీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కాకపోతే, వీటిని ఆయుర్వేద వైద్యుల సిఫారసుతోనే తీసుకోవాలి.
పుత్రజీవక
స్త్రీలలో సంతాన యోగ్యత పెంచుతుంది. హార్మోన్లను సమతూకంలో ఉంచుతుంది. అండాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. బీజావాపం బలంగా, ఆరోగ్యవంతంగా జరగడానికి హామీ ఇస్తుంది.
శివలింగి
ప్రధానంగా స్త్రీలలో వంధ్యత్వం నివారణకు, గర్భధారణ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు. అందులోనూ, దీని విత్తనాలు అండాల నాణ్యతను మెరుగు పరుస్తాయి.
జీవంతి
గర్భాశయం లోపలి పొర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శుక్రకణంతో ఫలదీకరణ తర్వాత పిండానికి పోషణ లభించడానికి దోహదపడుతుంది.
అశ్వగంధ
హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. గర్భాశయానికి టానిక్‌లా పనిచేస్తుంది. గర్భాశయ కండరాలను బలోపేతం చేస్తుంది. అండాల నాణ్యతను, లైంగిక వాంఛను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
శతావరి
స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు పోషకాలను అందిస్తుంది. హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. గర్భాశయ వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది. అండ పరిమాణం పెరుగుదలకు దోహదపడుతుంది.
గోక్షుర
పురుషులలో వీర్యకణాల సంఖ్య, నాణ్యతను వృద్ధి చేస్తుంది. టెస్టోస్టిరాన్ స్థాయులను పెంచుతుంది. స్త్రీలలో యోని పీహెచ్‌ను ఆరోగ్యకర స్థాయిలో ఉంచుతుంది. సహజ గర్భధారణకు సహకరిస్తుంది.
త్రిఫల
ఉసిరి, తానికాయ, కరక్కాయ.. ఈ మూడిటి మిశ్రమం త్రిఫల చూర్ణం. ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు దీన్ని పరిష్కారంగా ఉపయోగిస్తారు. గర్భాశయాన్ని (డిటాక్స్) శుద్ధిచేయడానికి త్రిఫల మంచి ఔషధం.
సంతాన యోగ్యత విషయంలో ఆయుర్వేదం ఆరోగ్యకర ఆహారం, ఉత్తమ జీవనశైలికి ప్రాధాన్యం ఇస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు, సిరి ధాన్యాలతో కూడిన భోజనం శరీరానికి తగినన్ని పోషకాలను అందిస్తుంది. అలా సంతాన యోగ్యతను సహజంగానే మెరుగుపరుస్తుంది. మంచి నిద్ర, ఉల్లాసంగా ఉండటం, సానుకూల దృక్పథం, ప్రతీరోజు మితమైన వ్యాయామం కూడా మనిషి సంతాన యోగ్యత విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. దీనివల్ల పిల్లలకు జన్మనివ్వడానికే కాదు, సమర్థంగా పెంచడానికి అవసరమైన మానసిక బలమూ చేకూరుతుంది. ఆరోగ్యకర కుటుంబానికి ఈ జీవన విధానమే పునాది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

