దాల్చినచెక్కలో క్యాన్సర్ నిరోధకాలు
మసాలా దినుసుగా వంటకాల్లో ఎక్కువగా వాడే దాల్చిన చెక్కలో రోగ నివారణ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యం ఎప్పుడో తేల్చింది. కాగా అల్లోపతి వైద్యంలో కూడా దాల్చిన చెక్క ద్వారా మొండి రోగాలను నియంత్రించవచ్చని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి.
- ఎలుకలపై ఎన్ఐఎన్ పరిశోధనలో వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): మసాలా దినుసుగా వంటకాల్లో ఎక్కువగా వాడే దాల్చిన చెక్కలో రోగ నివారణ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యం ఎప్పుడో తేల్చింది. కాగా అల్లోపతి వైద్యంలో కూడా దాల్చిన చెక్క ద్వారా మొండి రోగాలను నియంత్రించవచ్చని తాజా అధ్యయనాలు తెలుపుతున్నాయి. జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఎలుకలపై చేసిన ప్రయోగాల ప్రకారం దాల్చిన చెక్క నుంచి సేకరించిన మిశ్రమంలోని కొన్ని రసాయన సమ్మేళనాలు క్యాన్సర్‌ను నియంత్రిస్తున్నట్టుగా తేలింది. దాల్చిన చెక్కలో క్యాన్సర్ కణాల వృద్ధిని అరికట్టే గుణం ఉన్నట్టు ఎన్ఐఎన్ తెలిపింది. అయితే ఈ ప్రయోగం ఎలుకలపైనే నిర్వహించామని, మనుషులపై చేయడానికి ఇంకా కొంతకాలం పడుతుందని పేర్కొంది.
దాల్చిన చెక్కలో ప్రోసైనిడిన్ బీ2
దాల్చిన చెక నుంచి తీసిన సారంలో క్రియాశీలకంగా ఉండే ప్రోసైనిడిన్ బీ2లో యాంటీ క్యాన్సర్ ప్రభావం ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న ఎలుకను శాంపిల్‌గా తీసుకొని ప్రయోగంచేపట్టి కీమోప్రివెంటివ్ ఎఫిషియన్సీని అధ్యయనం చేశారు. దాల్చినచెక, దాని బయోయాక్టివ్ సమ్మేళనాలు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్న ఎలుక నమూనాలో ప్రొస్టేట్లోని కెమికల్ కార్సినోజెన్, టెస్టోస్టిరాన్ల కలయికకు విరుద్ధంగా పనిచేయడాన్ని గమనించారు. కీమో-ప్రివెంటివ్ డ్రగ్స్ మాదిరిగానే పనిచేసే గాఢత కలిగిన దాల్చిన చెక బయోయాక్టివ్ సమ్మేళనాలు కణాల విస్తరణను నిరోధించినట్టు తేల్చారు. దీనిపై మరింత లోతుగా విశ్లేషించాల్సి ఉండగా.. జంతువులపై జరిగిన ప్రయోగాల్లో సత్ఫలితాలు వచ్చినట్టు తెలిసింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

