Prenatal Infections | ప్రీనేటల్ ఇన్ఫెక్షన్లను ఇలా దూరం చేసుకోండి..!
ప్రీనేటల్ ఇన్ఫశ్రీక్షన్లు మహిళల్లో సర్వసాధారణం. గర్భం ధరించడానికి ముందు రోగ నిరోధకశక్తి ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని మహిళలు గమనించాలి. ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ల నివారణ శిశువుతోపాటు తల్లి ఆరోగ్యం రెండింటికీ...
ప్రీనేటల్ ఇన్ఫశ్రీక్షన్లు మహిళల్లో సర్వసాధారణం. గర్భం ధరించడానికి ముందు రోగ నిరోధకశక్తి ఏ మేరకు ఉన్నదనే విషయాన్ని మహిళలు గమనించాలి. రోగ నిరోధక శక్తి బాగానే ఉన్నదని నిర్ధారించుకున్నప్పుడే ప్రీనేటల్ సమస్యలు ఉత్పన్నం కావు. గర్భం దాల్చిన మహిళల్లో మూత్రవాహిన ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తుంటాయి. ప్రీనేటల్ ఇన్ఫెక్షన్ల నివారణ శిశువుతోపాటు తల్లి ఆరోగ్యం రెండింటికీ కీలకమని చెప్పవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన కొన్ని సూచనలు
చేతులు కడుక్కోవడం
రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించిన ప్రతీసారి, అలాగే ఆహారం తీసుకునే అన్ని సమయాల్లో చేతులను శుభ్రం చేసుకోవడం అలవర్చుకోవాలి. ముక్కు చీదడం, పెంపుడు జంతువులను తాకడం, మురికి వస్తువులను ముట్టుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. చేతులు కడుక్కోవడం వల్ల సూక్ష్మక్రిములను దూరంగా ఉంచవచ్చు.
వ్యక్తిగత అంశాలు
వ్యక్తిగత వస్తువులను ఎవరితోనైనా పంచుకోవడం వల్ల వారి నుంచి సూక్ష్మక్రిములు మనల్ని అంటుకుంటాయి. అందుకని వ్యక్తిగత వస్తువులైన దువ్వెన, గాజులు, ఇతర అలంకరణసామగ్రి, దుస్తులను దగ్గరివారైనా సరే పంచుకోకుండా చూడాలి.
వేలి గోర్ల పరిశుభ్రత
ఇన్ఫెక్షన్ను నివారించడానికి వేలి గోర్లను, వేళ్ల మధ్య, మణికట్టు చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. లేనట్లయితే, మురికి గోర్ల కింద, వేళ్ల మధ్య మన శరీరంలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయి.
ఫ్లూ టీకా
గర్భిణీలు ఇన్‌ఫ్లూయెంజా టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ టీకా తల్లిని ఫ్లూ జ్వరం బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే, శిశువుకు ఫ్లూ సోకే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొన్ని టీకాలు గర్భధారణకు ముందు లేదా గర్భం ధరించిన సమయంలో నేరుగా ఇవ్వరు. అందుకని టీకాల గురించి ఇంటి వైద్యుడిని సంప్రదించి తగు సలహాలు పొందాలి.
లైంగిక సంక్రమణ అంటువ్యాధులు
గర్భంతో ఉన్నప్పుడు లైంగిక సంక్రమిత అంటువ్యాధులు (ఎస్టీఐ) ఉన్నాయో లేదో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది వారితోపాటు బిడ్డపై కూడా ప్రభావం చూపుతాయి. ఎస్టీఐ పరీక్షలో పాజిటివ్‌గా తేలితే తల్లి, బిడ్డను రక్షించుకోవడానికి ఏం చేయాలో వైద్యులతో మాట్లాడాలి. గర్భంతో ఉన్నప్పుడు కొన్ని ఎస్టీఐ వ్యాధులకు చికిత్స అందించే వీలుంటుంది.
ఇన్ఫెక్షన్ ఉన్న వారితో..
గర్భధారణకు ముందు టీకాలు తీసుకోవడంలో విఫలమైన వారికి సురక్షితమైన దూరంలో ఉండాలి. కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నట్లయితే, ముఖానికి మాస్క్ ధరించడం, గుంపులుగా ఉండటం, సామాజిక దూరం పాటించడంపై దృష్టిపెట్టాలి. తరచుగా తాకే అవకాశాలున్న ప్రాంతాలను క్రిమిసంహారకాలను స్ప్రే చేయాలి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ప్రతీసారి చేతులను శుభ్రపరచుకోవాలి.
అనారోగ్యంతో ఉన్న వారితో..
అనారోగ్యంతో ఉన్నవారికి దూరంగా ఉండాలి. వైద్యులు సూచించిన విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలి. సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి.
ముడి పాలు, ఆహారాలతో జాగ్రత్త
పాశ్చరైజ్ చేయని పాలు, ఆహారాల్లో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇలా ముడి పాలు, ఆహారాలు కాకుండా వేడి చేసినవి మాత్రమే తీసుకోవాలి.
చెక్-అప్, ఫాలో-అప్ అవసరం
రెగ్యులర్ అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకోవాలి. ఫాలో-అప్ల కోసం దవాఖానలకు వెళ్తుండాలి. ఇలా చేయడం వల్ల గర్భిణీలు తమ ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే వీలుంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

