వేసవి తాపానికి చల్లని ఉపశమనం బార్లీ నీళ్లు..!
ఎండలు మండిపోతున్నాయి. ఎండతాపానికి తట్టుకోవాలంటే కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బార్లీ గింజలు గురించి తెలియనివారు ఉండరు. బార్లీ సీడ్స్‌తో ఎండతాపం నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం
ఎండ వేడి నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం అనేక మంది పలు రకాల పద్ధతులను పాటిస్తున్నారు. శీతల పానీయాలను తాగడం వాటిల్లో చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలోనే చాలా మంది వేసవి తాపం నుంచి సేదదీరి శరీరాన్ని చల్లబరుచుకునేందుకు రక రకాల శీతల పానీయాలను తాగుతున్నారు. అయితే సహజసిద్ధంగా తయారు చేసుకునే బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మరి బార్లీ నీళ్లను ఎలా తయారు చేసుకోవాలో, వాటితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఒక పాత్రలో 1 లీటర్ మంచినీటిని తీసుకుని ఆ నీటిలో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి వడపోసి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి. లేదా మధ్యాహ్నం ఎండకు బయటకు వెళ్లివచ్చిన వారు కూడా తాగవచ్చు. ఫ్రిజ్‌లో ఉంచి తాగితే శరీరానికి చల్లదనం కలుగుతుంది. అలాగే ఈ బార్లీ నీటిని తాగడం వల్ల ఇంకా ఎన్నోఅరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి.
– బార్లీ నీటిని తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. మూత్రాశయం శుభ్రంగా మారుతుంది. కిడ్నీ స్టోన్లు కరుగుతాయి. ముఖ్యంగా వేసవిలో మూత్ర సమస్యలతో బాధపడే వారికి బార్లీ నీళ్లు చక్కని ఔషధం అని చెప్పవచ్చు.
– బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వేడి బయటకు పోయి శరీరం చల్లగా మారుతుంది. అలాగే జీర్ణ సమస్యలైన గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. కీళ్లు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. విరేచనాలు అయిన వారు బార్లీ నీటిని తాగితే మంచిది.
– బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీటిని తాగాలి. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. వడదెబ్బ తాకకుండా ఉండాలన్నా, ఎండలో తిరిగి వచ్చిన వారు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా.. బార్లీ నీటిని తాగాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

