Aloe vera | శరీరం బరువు తగ్గించుకోవాలని చూస్తున్నారా..? అలోవెరాను డైట్లో చేర్చుకోండి..!
అలోవెరా.. ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. కలబంద అని కూడా పిల్చుకునే దీనిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరం బరువును తగిన రీతిలో మెయింటేన్ చేసుకోవచ్చు.
Aloe vera | అలోవెరా.. దీనినే మనం కలబంద అని కూడా పిలుస్తాం. ఇది ఓ ఔషధ మొక్క. ఈ మొక్క ఎక్కడైనా ఇట్టే పెరుగుతుంది. గాలిలో ఉన్న తేమను పీల్చుకుని పెరుగుతున్నందున ఈ మొక్కకు ప్రత్యేకంగా నీటి వనరులు అక్కర్లేదు. ఈ మొక్క జిగురులాంటి గుజ్జుతో నిండి ఉంటుంది. దీనిలో ఏ, సీ , ఈ విటమిన్లు ఉండి మన శరీరంలో కణాల పెరుగుదలకు, జుట్టు మెరిసేలా చేస్తాయి. దీని జెల్లో విటమిన్ బీ 12, ఫోలిక్ యాసిడ్ ఉండి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తాయి. శరీరం బరువు తగ్గించుకోవాలనుకునే వారు అలోవెరాను వివిధ రకాలుగా డైట్లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
అలోవెరా జెల్
జెల్‌ను వీటి ఆకుల నుంచి తీసి వినియోగించుకోవాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జెల్ రుచి కాస్తా వికారంగా ఉంటున్నందున దీనిని తీసుకోవడానికి ముందు శుభ్రంగా కడగడం మరిచిపోవద్దు.
అలోవెరా జ్యూస్
శరీరం బరువు తగ్గించుకోవడానికి కలబంద రసాన్ని నిత్యం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి కనీసం 15 నిమిషాల ముందు ప్రతి రోజు ఒక టీ స్పూన్ దీని రసం తాగడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
కూరగాయల జ్యూస్‌తో మిక్స్..
కలబంద జ్యూస్‌ను నేరుగా తాగేందుకు ఇబ్బందిగా ఉంటే ఇతర కూరగాయల ముక్కలతో కలిపి జ్యూస్‌గా చేసుకుని తాగాలి. ఇలా కూడా కడుపునిండిన భావన ఏర్పడి శరీరం బరువు తగ్గుతుంది.
తేనెతో అలోవెరా జ్యూస్..
అలోవెరా జ్యూస్‌ను తేనెతో కలిపి తీసుకోవడం మరో మార్గం. ఇది కొంత రుచిని ఇస్తుంది. తేనెలో ఉండే పోషకాలు కూడా మనలో చేరి మనకు శరీరం బరువు తగ్గించుకోవడంలో సాయపడుతుంది.
నిమ్మరసంతో అలోవెరా జ్యూస్..
అలోవెరా జ్యూస్ డైరెక్ట్‌గా తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పుడు కొంత నిమ్మరసం కలిపి తీసుకోవాలి. నిమ్మరసంతో కలపడం వల్ల రుచితో పాటు విటమిన్ సీ కూడా అందుతుంది. ఈ మిక్స్ ముఖ్యంగా ఉదయం వేళ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు రాబట్టొచ్చు.
అలాగే, శరీరం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ సమస్యలు కూడా బరువు పెరగడానికి దోహదం చేస్తాంయి. అందువల్ల ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను నిర్వహించడం చాలా అవసరం. దీనిలో విటమిన్ బీ పుష్కలంగా ఉండి జీవక్రియను పెంచడంలో సాయపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌తోపాటు పాలీశాకరైడ్లను కలిగి ఉండి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతాం.
దీనిలో మరో ముఖ్య ప్రయోజనం.. రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపర్చుకోవడం. కోరికలను తగ్గించడం ద్వారా బరువు పెరగకుండా చూస్తుంది. కలబందను తీసుకోవడం ద్వారా కడుపు నిండిన భావనతో ఆహారం ఎక్కువగా తీసుకోలేం. గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి ఆకలిని నియంత్రిస్తుంది. ఫలితంగా శరీరం బరువును తగ్గించుకోవచ్చు. శరీరం బరువును తగ్గిచుకోవడం ఒక్కటే కాకుండా చర్మం సహజ రంగును కాపాడుతుంది. పిగ్మెంటేషన్ తొలిగిస్తుంది. ముఖంపై నల్ల, తెల్లమచ్చలను తొలగించుకోవడంలో సాయపడుతుంది. దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిర్మూలించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఇది అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్య నిపుణుడిని లేదా ఇంటి వైద్యుడిని సంప్రదించండి. ఈ కథనంతో ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యం ఎలాంటి బాధ్యత వహించదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

