BRICS Top Universities | బ్రిక్స్ టాప్ యూనివర్సిటీలు
ఇండియా
యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
-దేశంలో అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన విశ్వవిద్యాలయం ఇది.
-ఇది 1922లో ప్రారంభమైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తింపు పొందింది.
-ఈ యూనివర్సిటీలో ప్రవేశాలు పొందే విద్యార్థుల శాతం (45,000 వేలమంది) ఎక్కువగా ఉంటుంది.
-డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీ అనేక రకాల ప్రోగ్రామ్స్‌తో పాటు విద్యా సంబంధమైన కోర్సులను అందిస్తుంది.
-అంతేకాకుండా ఎన్నో రకాల అకడమిక్, నాన్ అకడమిక్ కోర్సులను అందిస్తుంది. విదేశీ విద్యకు పెద్దపీట వేస్తుంది.
-ఆన్లైన్ కోర్సులు, దూర విద్యను అందిస్తుంది.
-విద్యార్థుల నమోదుకు తగ్గటుగానే వసతులను అంతే స్థాయిలో కల్పిస్తున్న విద్యాలయం ఇది.
-లైబ్రెరీ, స్టడీహాల్స్, స్పోర్ట్స్, విద్యార్థులకు కావాల్సిన ఇతర యాక్టివిటీస్‌ను సమకూరుస్తూ దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీగా పేరొందింది.
-అడ్రస్: నార్త్ ఢిల్లీ క్యాంపస్, మాల్ రోడ్డు ఢిల్లీ, 110007 ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ, ఇండియా, వెబ్సైట్ www.du.ac.in.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై
-ఇది 1958లో ప్రారంభమైంది.
-బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీస్ అకడమిక్, నాన్ అకడమిక్, ఆన్లైన్ కోర్సులు, విదేశీ, దూరవిద్యతో పాటు విద్యాసంబంధమైన కోర్సులను అందిస్తుంది. సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కోర్సులను కూడా అందిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కలిగిన ఐఐటీ ముంబైలో ప్రవేశాల కోసం ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఆసక్తి చూపిస్తుంటారు.
-ఆర్ట్స్, బిజినెస్, మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులనూ అందిస్తుంది.
-టాప్ ఫ్యాకల్టీ కలిగిన ఈ యూనివర్సిటీ ఇంటర్న్‌షిప్, స్కాలర్షిప్స్ అందిస్తుంది.
-ప్లేస్మెంట్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.
-అడ్రస్: పొవాయి ముంబై, 400076 మహారాష్ట్ర, ఇండియా. వెబ్సైట్: www.iitb.ac.in
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్
-ఇది 1959లో ప్రారంభమైంది.
-తమిళనాడులో ఉన్న ఈ విశ్వవిద్యాలయం అత్యున్నత విద్యా ప్రమాణాలను అందిస్తుంది.
-ఆర్ట్స్, బిజినెస్, మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులతో పాటు అన్ని రకాల డిగ్రీ, డిప్లొమాతో పాటు అకడమిక్, నాన్ అకడమిక్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.iitm.ac.in
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్
-1959లో ప్రారంభమైంది.
-ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ఉత్తమ విద్యాప్రమాణాలను పాటిస్తుంది.
-అన్ని రకాల డిప్లొమా, డిగ్రీలతో పాటు, దూరవిద్య, విదేశీ విద్య, అకడమిక్, నాన్ అకడమిక్ కోర్సులను అందిస్తుంది.
-ఆర్ట్స్, బిజినెస్, మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులను బోధిస్తుంది.
-లైబ్రెరీ, విశాలమైన తరగతి గదులను కలిగిన ఈ విశ్వవిద్యాలయం స్కాలర్షిప్స్ అందిస్తుంది.
-1055 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ క్యాంపస్ విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులను సమకూరుస్తుంది.
-జేఈఈ ప్రవేశాల ఆధారంగా ఇక్కడ ప్రవేశాలు ఉంటాయి.
-వెబ్సైట్ : www.iitk.ac.in

అన్నా యూనివర్సిటీ
-1978లో ప్రారంభమైంది.
-ఆర్ట్స్, బిజినెస్, మెడిసిన్, ఇంజినీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సులతో పాటు డిప్లొమా, డిగ్రీ, ఆన్లైన్, దూర విద్యాకోర్సులను అందిస్తుంది.
-తమిళనాడులో గల ఈ యూనివర్సిటీ మెరుగైన వసతులతో ఆకట్టుకుంటుంది.
-వెబ్సైట్ : www.annauniv.edu
సౌతాఫ్రికా

యూనివర్సిటీ ఆఫ్ కేప్‌టౌన్
-1829లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ అతి పురాతనమైనది. ప్రపంచంలోనే మొదటి గుండెమార్పిడి జరిపిన యూనివర్సిటీగా పేరుంది.
-మెడిసిన్, లా, అగ్రికల్చర్, జియోగ్రఫీ కోర్సులను అందిస్తుంది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉంది.
-వెబ్సైట్: www.uct.ac.za
యూనివర్సిటీ ఆఫ్ ది విట్వాటర్సాన్డ్
-1896లో స్థాపించబడింది.
-ప్రస్తుతం 33,300 మంది విద్యార్థులు ఉన్న ఈయూనివర్సిటీలో 2,600 బయటి దేశం విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఆర్కియాలజీతో పాటు ఇతర విద్యా సంబంధమైన కోర్సులను అందిస్తుంది.
-బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానం.
-వెబ్సైట్ : www.wits.ac.za
స్టెల్లోన్బోస్చ్ యూనివర్సిటీ
-1918లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 30,100 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
-మెడిసిన్, హెల్త్ సైన్స్ ఫ్యాకల్టీ గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తూ ఆరోగ్యాభివృద్ధికి కృషి చేస్తుంది.
-వెబ్సైట్ : http://www.sun.ac.za
బ్రెజిల్
యూనివర్సిడేడ్ డే సాయో పాలో
-1934లో స్థాపించబడింది.
-బ్రెజిల్‌లోనే పేరుప్రఖ్యాతులు గల ఈ యూనివర్సిటీ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానం పొందింది.
-12 మంది బ్రెజిల్ అధ్యక్షులు ఇక్కడ విద్యనభ్యసించడం విశేషం.
-బ్రెజిల్‌లోనే పేరొందిన ఈ యూనివర్సిటీకి ఎక్కువ సంఖ్యలో ప్రవేశాలు వెల్లువెత్తుతుంటాయి.
-మొత్తం 11 క్యాంపస్‌లు ఉన్న ఈ యూనివర్సిటీలో అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్, ఆర్కిటెక్ట్ కోర్సులతో పాటు అంతర్జాతీయ ముఖ్యమైన పాఠాలను బోధిస్తుంది.
-వెబ్సైట్: www.usp.br
యూనివర్సిడేడ్ ఎస్టాడ్యూల్ డి క్యాంపైనస్
-1966లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీకి బ్రిక్స్‌లో 12వ స్థానం.
-వరల్డ్ బెస్ట్ యంగ్ ఇన్స్టిట్యూషన్గా పేరుంది.
-35,600 మంది విద్యార్థులున్న ఈ యూనివర్సిటీలో 16,000 మంది పీజీ చేస్తున్నారు.
-ఫారెస్ట్రీ, డెంటిస్ట్రీ, అగ్రికల్చర్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.unicamp.br
యూనివర్సిడేడ్ ఫెడరల్ రియో డీ జనీరో
-1792లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ లాటిన్ అమెరికాలోనే అతి పురాతనమైనది.
-ఈ ఏడాది బ్రిక్స్ కంట్రీస్‌లో ఈ యూనివర్సిటీ 29వ ర్యాంక్ పొందింది.
-67,000 మంది ఉన్న ఈ యూనివర్సిటీలో అధిక సంఖ్యలో మ్యూజియమ్స్, హాస్పిటల్స్, రిసెర్చ్ సెంటర్లు ఉన్నాయి.
-బ్రెజిల్‌లోనే రెండో పెద్ద నగరమైన రియో డీ జనీరోలో 2016 ఒలింపిక్స్ జరిగాయి.
-ఆర్ట్స్, సోషియాలజీ, మినరల్స్ అండ్ మైనింగ్ ఇంజినీర్సింగ్ కోర్సులను ఆఫర్ చేస్తుంది.
-వెబ్సైట్ : ufrj.br
యూనివర్సిడేడ్ ఎస్టాడ్యూల్ పాలిస్టా జూలియో డీ మెస్క్విట ఫిలో
-1976లో స్థాపించబడింది.
-ఈ యూనివర్సిటీకి బ్రిక్స్‌లో 36వ ర్యాంక్ కాగా, లాటిన్ అమెరికాలో 12వ స్థానం
-23 క్యాంపస్‌లు కలిగిన ఈ యూనివర్సిటీలో 50,600 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
-33 లైబ్రెరీ, రెండు యూనివర్సిటీ హాస్పిటల్స్, మూడు వెటర్నరీ హాస్పిటల్స్‌తో అనేక రకాల క్లినిక్‌లు ఉండటం వల్ల రిసెర్చ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది.
-డెంటిస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.unesp.br
యూనివర్సిడేడ్ ఫెడరల్ డీ సాయో పాలో
-1933లో స్థాపించబడింది.
-ఈ యూనివర్సిటీకి బ్రిక్స్‌లో 45వ స్థానం కాగా, లాటిన్ అమెరికాలో 27వ స్థానం పొందింది.
-హెల్త్ సైన్స్ పట్ల ప్రత్యేక దృష్టి సారించిన ఈ యూనివర్సిటీ ప్రపంచంలో బెస్ట్ ఫోర్ సబ్జెక్టులను బోధిస్తుంది.
-నర్సింగ్, ఫార్మసీ, మెడిసిన్, బయాలాజికల్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.unifesp.br
రష్యా
1. లామన్సావ్ మాస్కోస్టేట్ యూనివర్శిటీ
-రష్యన్ కంట్రీలోనే పురాతనమైన యూనివర్సిటీ ఇది
-1755లో స్థాపించబడింది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 7వ స్థానంలో నిలిచింది.
-మాస్కోలో ఉన్న ఈ యూనివర్సిటీలో ప్రస్తుతం 47,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
-ఈ యూనివర్సిటీకి ప్రపంచంలోనే అతి పొడవైన భవనం ఉంది. భాషాశాస్త్రం, గణితం, ఫిజిక్స్, ఆస్ట్రానమి కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.msu.ru
2. సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ
-1724లో స్థాపించబడింది.
-బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానం
-రష్యాలోని అతి పురాతన యూనివర్సిటీలో 30,000 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
-భాషాశాస్త్రం, గణితం, ఫిలాసఫీ, చరిత్ర, ఆధునిక భాషలు వంటి కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: http://english.spbu.ru
3. నవోసిబిర్క్స్ స్టేట్ యూనివర్సిటీ
-1959లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 20వ స్థానం
-13 మంది ఫ్యాకల్టీ ఉన్న ఈ యూనివర్సిటీలో 6,000 మంది విద్యార్థులే చదవడానికి అవకాశం ఉంది.
-ఫిజిక్స్, ఆస్ట్రానమి, మ్యాథమెటిక్స్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్: www.nsu.ru
చైనా
సింఘా యూనివర్సిటీ
-గత మూడేళ్ల కాలంలో చైనాలోనే కాకుండా బ్రిక్స్ కంట్రీస్‌లోనే అత్యున్నత విద్యా ప్రమాణాలు పాటిస్తున్న యూనివర్సిటీ ఇది.
-1911లో ప్రారంభమైన ఈ యూనివర్సిటీ బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానం పొందింది.
-ఇప్పటివరకు 46,200 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు.
-కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, లా, ఆర్ట్స్ అండ్ డిజైన్స్, పాలిటిక్స్, మ్యాథమెటిక్స్, ఆధునిక భాషల కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.tsinghua.edu.cn
పెకింగ్ విశ్వవిద్యాలయం
-1898లో స్థాపించబడింది.
-చైనా టాప్ యూనివర్సిటీల్లో రెండవది.
-బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో 9వ స్థానం
-ఈ యూనివర్సిటీలో చైనా విద్యార్థులే కాకుండా జర్మనీకి చెందిన విద్యార్థులు ప్రవేశాలు పొందుతుంటారు.
-ఆధునిక భాషలు, కెమిస్ట్రీ, డెంటిస్ట్రీ, మైనింగ్ ఇంజనీరింగ్, లా, కంప్యూటర్‌సైన్స్, మెకానికల్ సైన్స్, ఆర్ట్ అండ్ డిజైన్, మ్యాథమెటిక్స్ కోర్సులను అందిస్తుంది.
-వెబ్సైట్ : www.pku.edu.cn
Read Today's Latest General News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

