ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ జెనిటిక్స్ విభాగంలో కేటగిరీ – 1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) – జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించిన వారితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ సాధించిన వారు అర్హులని అధికారులు తెలిపారు.
ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు సంబంధిత పత్రాలతో కలిపి విభాగం కార్యాలయంలో సమర్పించాలని చెప్పారు. ఎంపి కైనవారు విభాగంలోని మాలిక్యులర్ మెడిసిన్ ల్యాబ్లో డాక్టర్ సోమేశ్వర్ ఆర్. సగుర్తి పర్యవేక్షణలో పీహెచ్డీ చేయవచ్చ న్నారు. ఇతర వివరాలకు 040 – 27095178, 27682335, 7729822608 నెంబర్లలో సంప్రదించాన్నారు.