గత ఏడాది గౌతమ్కిచ్లూను వివాహమాడింది వెండితెర అందాల చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కెరీర్‌కు కాస్త బ్రేక్‌నిచ్చి కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నది. కాజల్ గర్భవతి అయ్యిందంటూ గతంలో సోషల్‌మీడియా వేదికల్లో వార్తలు వెలువడ్డాయి. వాటిని ఖండించిన కాజల్…సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా ఆ శుభవార్తను వెల్లడిస్తానని చెప్పింది. తాజాగా నూతన సంవత్సరం వేళ కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్కిచ్లూ ఈ విషయాన్ని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కాజల్ ఫొటోను షేర్ చేసిన ఆయన దానికి గర్భందాల్చిన మహిళ ఎమోజీని జోడించారు. మాతృత్వ మాధుర్యాన్ని ఆస్వాదించాలని తాను ఎంతగానో ఎదురుచూస్తున్నానని గతంలో కాజల్ అగర్వాల్ చెప్పింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో నటిస్తున్న ‘ఆచార్య’, హిందీ ‘ఉమ’ చిత్రాలు షూటింగ్‌ను పూర్తిచేసుకున్నాయి.