గేట్ రిజిస్ట్రేషన్ గడువు పొడగింపు.. ఈ నెల 4 వరకు అనుమతి
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2023) కి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువును పొడగించారు. ఈ నెల 4 వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. నిజానికి గడువు గత నెల 30 తో...
న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్ 2023) కి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు గడువును పొడగించారు. ఈ నెల 4 వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. నిజానికి గడువు గత నెల 30 తో ముగిసింది. అయితే, పెద్ద సంఖ్యలో విద్యార్థుల నుంచి అందిన వినతుల మేరకు రిజిస్ట్రేషన్ గడువును మరో నాలుగు రోజులు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గేట్-2023 నిర్వహణ కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) చేపడుతున్నది. అభ్యర్థులు ఆన్లైన్లో gate.iitk.ac.in వెబ్సైట్లో ఈ నెల 4లోగా ఎటువంటి ఆలస్య రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2023 అర్హత పొందిన అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. గేట్ 2023 ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో జరగాల్సి ఉన్నది.
గేట్ 2023 ఈ ఏడాది 29 పేపర్లకు నిర్వహిస్తారు. 29 పేపర్లతో పాటు అభ్యర్థులు గేట్ అప్లికేషన్ ప్రక్రియలో రెండు పేపర్ కాంబినేషన్ కూడా ఎంచుకోవచ్చు. ప్రతి గేట్ 2023 పేపర్ మొత్తం 100 మార్కులకు, జనరల్ ఆప్టిట్యూడ్ అన్ని పేపర్లకు (15 మార్కులు) సాధారణం. మిగిలిన పేపర్ సంబంధిత సిలబస్‌ను (85 మార్కులు) కవర్ చేస్తుంది.
Read Today's Latest Election-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

