ఆడవారి కోపానికి
హద్దు కదా ముక్కు పుడక..!!
ముద్దుగుమ్మ అందాలకు
ముద్దు కదా ముక్కు పుడక..!!
ఓర కంటి చూపులతో
సఖుడు పలకరిస్తుంటే..
అతని చూపు తాకే
ఓ మెరుపు కదా ముక్కు పుడక!!
చిరు చీకటి ఊసులలో
జతగాడిని గిచ్చుతుంది..
మురిసిపోవు మగువ మోము
కెంపు కదా ముక్కు పుడక..!!
వద్దు వద్దు అంటూ తను
బుంగ మూతి పెడుతుంటే..
బుగ్గ చాటు దాగుండే
సిగ్గు కదా ముక్కు పుడక..!!
అతివ మేని సోయగాలకెన్ని
హంగులద్దినా..
మోముపైన చిరు మెరుపుల
విందు కదా ముక్కు పుడక..!!
పేరిశెట్టి బాబు 92471 70800