అమరుల త్యాగంబు లరయ వలయు
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగ అమరుల త్యాగంబు లరయ వలయు శాస్త్ర సాంకేతిక జ్ఞాన సాధనయందు శాస్త్రవేత్తల కృషీ స్మరణ వలయు భవిత దర్శించిన ప్రజ్ఞ నాయక తతి నెంతేని యెదను మన్నింప వలయు
స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగ
అమరుల త్యాగంబు లరయ వలయు
శాస్త్ర సాంకేతిక జ్ఞాన సాధనయందు
శాస్త్రవేత్తల కృషీ స్మరణ వలయు
భవిత దర్శించిన ప్రజ్ఞ నాయక తతి
నెంతేని యెదను మన్నింప వలయు
వ్యవసాయ కర్షక వాణిజ్య రంగాల
సంపద బెంచిన జ్ఞాన ధనుల
జన్మ భూమిని రక్షించు సైనికాళి
విలువ లరసి అవ్వారిని పెద్ద జేసి
గార వించంగవలె నదే ప్రేరణమ్ము
మహిత వజ్రోత్సవాలకే మాన్య మద్ది!
సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర
రాజ్యాంగ విభవమ్ము వ్రాసుకొనగ
మత సామరస్యమ్ము మాన్యమై వెలసెను
లౌకిక రాజ్యమ్ము రమణ గాంచె
సామూహికమ్ముగా జాతీయ గీతమ్ము
స్వేఛ్ఛగా పాడంగ వ్వీలు గలిగె
ప్రతిభ అందల మెక్కె ప్రగతి వికశించె
సంక్షేమ పథకాలు శ్వాస గూర్చె
పెరుగ నాదాయ వనరులు, విద్య అమర
బడుగు జీవుల బతుకులు పదిల మయ్యె
తగ్గె నాకలి చావులు, తాగునీరు
సాగు నీరమ్ము లందెను జనులకెల్ల!
ప్రజల యొక్కకు ప్రజలచే ప్రజల కొరకు
ప్రభుతయన్న ప్రజాస్వామ్య రాజ్య మమెరె
భరత జాతికి స్వేచ్ఛ సంప్రాప్తమయ్యె
బాధ్యతలు హెచ్చె హక్కులు పరిఢ విల్లె!
డెబ్బదైదేండ్ల స్వాతంత్య్ర ఠీవి మాది
జగతి ప్రగతిలో భారత ప్రగతి కూడా
గణనకెక్కెను, ప్రజ్ఞ వికాస పథము
సాగుటే అమృతోత్సవ సరణి, నిజము
– పాలకుర్తి రామమూర్తి
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

