ఉప్పే నిప్పై ఉరిమిన వేళ
బహుశా ఎవరి ఊహకంది ఉండదు ఉప్పుతో కూడా నిప్పును రగిలించవచ్చని... సముద్రం నుండి వచ్చిన ఉప్పు కూడా పెను ఉప్పెన సృష్టించగలదని పిడికిలి బిగించగలదని... బహుశా అంతవరకు ఈ లోకం ఊహించి ఉండదు చేతిలో కాసింత ఉప్పు కలిక కూడా
బహుశా ఎవరి ఊహకంది ఉండదు
ఉప్పుతో కూడా నిప్పును
రగిలించవచ్చని…
సముద్రం నుండి వచ్చిన
ఉప్పు కూడా పెను ఉప్పెన
సృష్టించగలదని
పిడికిలి బిగించగలదని…
బహుశా అంతవరకు
ఈ లోకం ఊహించి ఉండదు
చేతిలో కాసింత ఉప్పు కలిక కూడా
నిప్పులా మండిపోతుందని…
బల్లమీద ఉప్పు కనిపిస్తే
ఉలికి పడి ఉండవచ్చు
నీళ్ళలో కరిగిపోయె ఉప్పుకు
అంత బలం ఉంటదని
శత్రువుకు తెలిసుండదు
లేకుంటే ఉప్పు మీద పన్ను వేసి ఉండడు
కాసింత ఉప్పు రేణువులు
కోట్లాది గొంతులై
నినదించగలవని
బహుశా ఉప్పును కన్న
కడలి సైతం కలగని ఉండదు
తెల్లని పిడుగై
మంటలు రేపుతుందని…
భోజనాల బల్లమీద ఉప్పు డబ్బాను చూసి
ఆ తెల్లవాడు మరింత
పాలిపోయివుండవచ్చు…
వాడికేం తెలుసు కన్నీటి ఉప్పదనం
ఉప్పే కదా అని శిస్తు వేస్తే
అదే నిప్పై దండు కడుతుందని
ఆ యాత్ర అనంత సాగరమౌతుందని
వాడిని చిటికెడు ఉప్పే
ఉరిమి చూస్తుందని
బహుశా వాడికి తెలియకపోవచ్చు…
– సుంకర రమేశ్
94921 80764
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Dandi March
- NT Kavithalu
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

