సింగిడిపూలు
స్వప్నం నెరవేరి
తీపి జ్ఞాపకపు అలలై హృదయం ఆర్ద్రమవుతున్నది
కోటి నక్షత్రాల ఉజ్వల ఉదయాన
సింగిడిపూల బంగారు రథంపై నా తెలంగాణ!
కాకతీయుల కాలపు చెరువులు
అలుగు దుంకి పారుతున్నయి
నదీనదాలు మోడువారిన నేలను ముద్దాడుతున్నయి
అడుగుపెడితె మడుగులై
నీటి దారలు పంటలను తడుపుతున్నయి
రోడ్డుపై బతుకుల ఎదురుచూపులకు
చిల్లుల గుడిసె ఎక్కిరింపులకు
రెండు పడకల గది గొడుగై నిలిచింది!
వీధి దీపాలా ఎన్నీల వెలుగులు
చీకట్లలో లాంథరై తోవ చూపుతున్నది
బాసింగం బలములేని ఆడబిడ్డలకు అండగా
కల్యాణలక్ష్మి గుండె బరువు దించింది
ఒంటరి మహిళకు తోడునిల్చే బంధుగా
వితంతు మహిళకు ఆర్తినిచ్చే తిలకంగా
వృద్ధాప్య దీనజన ఆపద్బంధుగా
వెలివాడ జాతిజనుల దళితబంధుగా
నా తెలంగాణ ప్రగతి రథచక్రాలు
నిత్య నూతనమై దేశానికి దారిచూపుతున్నవి
పల్లె, పట్నం ఒక్కటై… రైతన్నల పసిడిపంటలు
ఐటీ హబ్‌ల ఆవిష్కరణలతో
తెలంగాణ పరుగులు పెడుతున్నది..!
పెద్ది భరత్
85000 91095
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

