నిద్ర లేమితో రోగాలెన్నో!
మనకు తెలియకుండానే మనపై ప్రకృతి ప్రభావం చాలా ఉంటుంది. సృష్టి ధర్మం అలాంటిది. సూర్యచంద్రుల కారణంగా మనిషి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా పలురకాలైన హార్మోన్లు, ఎంజైమ్స్, కెమికల్స్ విడుదలవుతాయి.
మనకు తెలియకుండానే మనపై ప్రకృతి ప్రభావం చాలా ఉంటుంది. సృష్టి ధర్మం అలాంటిది. సూర్యచంద్రుల కారణంగా మనిషి శరీరంలోని వివిధ అవయవాల ద్వారా పలురకాలైన హార్మోన్లు, ఎంజైమ్స్, కెమికల్స్ విడుదలవుతాయి. మనిషి నిద్రపోయిన తర్వాత రసాయన పదార్థాలు విడుదలవుతాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత మనిషి ఆలోచన, అతని మేధోశక్తి, సామాజిక లేదా వ్యక్తిగత వ్యవహారాలపై అంతకుముందు నిద్రలో విడుదలైన రసాయన పదార్థాలు సంపూర్ణ ప్రభావం చూపుతాయి.
మన పూర్వీకులు ఉదయం కాలకృత్యా లు మొదలు చకచకా పనులు చేసుకోవడం పరిపాటి. తమ తమ ఆలోచనలతో పదిమందికి ఉపయోగపడే ఆరోగ్యమైన జీవితం గడపాలని అందరూ కోరుకుంటారు. అందుచేత సూర్యాస్తమయ సమయానికే పనులన్నీ ముగించుకొని ఏ ఇబ్బందుల్లేకుండా నిరంతరాయంగా నిద్రపోవడం వంటి కారణాల వల్ల ఏండ్ల తరబడి ఆరోగ్య జీవితం గడిపేవారు.
మెలాటోనిన్ హార్మోన్: మనిషి శరీరంలో రాత్రిపూట విడుదలయ్యే అతి ముఖ్యమైన హార్మోన్ మెలటోనిన్. దీనివల్లే మనిషి నిద్రలోకి జారుకుంటాడు. దీనివల్లే బీపీ, షుగర్లు సాధారణ స్థాయిలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని పెంపొందిస్తుంది. మనిషి కోపాన్ని తగ్గించడం మొదలు ఎన్నో ఉపయోగాలున్నాయి. రిప్రొడక్టివ్ హార్మోన్లను విడుదల చేస్తుంది. రిప్రొడక్టివ్ హార్మోన్లు శారీరక అవయవాల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. మెలటోనిన్ హార్మోన్ సరైనస్థాయిలో ఉంటేనే ఉదయాన్నే కార్టిసాల్ హార్మోన్ మనిషిలో విడుదలవుతుంది. కాలక్రమేణా పని ఒత్తిడి కారణంగా మనిషి సరిగా నిద్రపోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. దీంతో రాత్రిపూట మెదడులోని పీనియల్ గ్లాండ్ నుంచి విడుదలయ్యే మెలటోనిన్ సరిగ్గా విడుదల కావడం లేదు. తత్ఫలితంగా మానవ శరీరాన్ని కాపాడే వందలాది హార్మోన్లు, కెమికల్స్, ఎంజైమ్స్ గాడి తప్పుతున్నాయి.
సిర్కాడియన్ రిథం: మనం ఉదయాన్నే నిద్ర లేవటానికి, పనుల్లో చురుకుదనం చూపించటానికి, మేధోశక్తి సరిగ్గా పనిచేయటానికి ఉపయోగపడే హార్మోన్ కార్టిసాల్. మనం రాత్రి నిద్రపోవటానికి, మనిషికి ఉపయోగపడే అన్నిరకాల హార్మోన్లు, కెమికల్స్‌ను క్రమబద్ధీకరించడానికి మెలటోనిన్ హార్మోన్ ఉపయోగపడుతుంది. ఈ కార్టిసాల్, మెలటోనిన్ సైకిల్‌ను మనిషి శరీరంలో రాత్రిపూట నడిపించేది సిర్కాడియన్ రిథం.
ఎవరిలో అయితే సిర్కాడియన్ రిథం దెబ్బతింటుందో, వారి శరీరంలో సుమారు 90 రోజుల్లోపల బీపీ, షుగర్ వంటి వ్యాధులు వస్తాయి. ఒత్తిడి, మానసిక అలజడి, గురక, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశాలుంటాయి. డిప్రెషన్, మానసిక రుగ్మత, ద్వేషభావం వంటి అనేక వ్యాధులుగా మార్పులు తలెత్తే అవకాశం ఉంటుంది. సిర్కాడియన్ రిథం, మెలటోనిన్, కార్టిసాల్ దెబ్బతినడానికి కారణాలనేకం.
గురకపెట్టి నిద్రపోవడం అంటే సాధారణంగా బాగా నిద్ర పోతున్నాడని చాలామంది అనుకుంటారు. ఇది అబద్ధం. రాత్రి పడుకున్నప్పుడు గురకపెట్టే వారిలో చాలామందికి గొంతుభాగంలో, కొండనాలిక వల్ల, పెద్ద నాలిక వల్ల, శ్వాసప్రక్రియలో తీవ్ర ఆటంకం కలగడం వల్ల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగా చేరక గురక వస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ లేని రక్తం గుండెకు ప్రవహిస్తుంది. అదే రక్తం అక్కడినుంచి పలు అవయవాలకు ప్రవహిస్తుంది. మానవ మెదడుకి కావలసింది 100 శాతం స్వచ్ఛమైన ఆక్సిజన్. కానీ గొంతులో ఆటంకం వల్ల గుండెకు చేరే రక్తంలో ఆక్సిజన్ లేని కారణంగా, మెదడు వరకు వచ్చే రక్తంలో కూడా ఆక్సిజన్ లోపిస్తుంది. దీంతో మెదడుపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దీనితోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. రాత్రిపూట గురకపెట్టే వారిలో 62.7 శాతం మంది వారు సడెన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్‌తో మరణిస్తున్నారని పలు పరిశోధనలో వెల్లడైంది. పక్షవాతం వచ్చిన వారిలో 50 శాతం వరకు గురక పెట్టేవారే ఉన్నారని పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. నిద్రలేమి కారణంగా సిర్కాడియన్ రిథం దెబ్బతింటుంది. ఇలాంటివారిలో విపరీతమైన అలసట, చిరాకు, ఉదయం నిద్రపోవడం, తదితర లక్షణాలుంటాయి. మార్పులను గమనించి సంబంధిత వైద్యుడిని సంప్రదిస్తే సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు.
డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్: 1800 425 0095
(వ్యాసకర్త: స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్)
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

