జీవాత్మలు-ప్రేతాత్మలు
పదేండ్లయిపోయాయి ఇక ఇటువైపు ఆ చూపు పడదనుకున్నాం. కానీ, దొంగలించిన ప్రాణం, చూపు మరోసారి ఇటు మళ్లింది. ఇక్కడో శిష్యుడు. పాతాళ భైరవి మాంత్రికునికి ఉన్నట్టు ఒకడున్నాడు. ఈ ఇద్దరు గురుశిష్యులు కూడా ఆ మాంత్రికునికి, ఆ శిష్యునికి ఏ మాత్రం తీసిపోరు.
మహా ఘనత వహించిన ఒక జీవాత్ముడు మొన్న హైదరాబాద్ వచ్చి వెళ్లాడు. ఎందుకు వచ్చి వెళ్లాడో, అంతరార్థం ఏమిటో తెలియదు. ఊరక రారు కదా మహాత్ములు. ఆ ఆత్మకు తెలంగాణ, ఆంధ్రలు రెండు కండ్లట. నిజమే ఒకటి శీతకన్ను, వేరొకటి వేడి నీటి కన్ను. ఆ ఆత్మ తెలంగాణపై శీతకన్నేస్తూనే ఉంటుంది. వేరొక కన్నుతో ఈర్ష్యా అసూయలతో వేడి నీటిని చిమ్ముతూనే ఉంటుంది. ఆ కళ్లు ఎంత పవర్ఫుల్ అంటే పిల్లనిచ్చినవాన్ని కూడా అధఃపాతాళ లోకాలకు తొక్కే శని చూపు కలవి.
పదేండ్లయిపోయాయి ఇక ఇటువైపు ఆ చూపు పడదనుకున్నాం. కానీ, దొంగలించిన ప్రాణం, చూపు మరోసారి ఇటు మళ్లింది. ఇక్కడో శిష్యుడు. పాతాళ భైరవి మాంత్రికునికి ఉన్నట్టు ఒకడున్నాడు. ఈ ఇద్దరు గురుశిష్యులు కూడా ఆ మాంత్రికునికి, ఆ శిష్యునికి ఏ మాత్రం తీసిపోరు. ఏ మాత్రం చాన్స్ దొరికినా ఊళ్లకు ఊళ్లే, పట్టణాలకు పట్టణాలే కబళించుకుపోగలరు. ‘జై పాతాళ భైరవి’ అంటూ ఇప్పుడు ఈ మాంత్రికునికి దేశంలో ఒక యుగ పురుషుడు తోడయ్యాడు. ఈ యుగ పురుషుడు తనకు తాను అవతార పరుషుడనుకొంటాడు, కానీ మొన్న ప్రజలు నెత్తిపై మొట్టికాయలు మొత్తి నీవు యుగ పురుషుడవు కావు కాపురుషుడవని చెప్పారు. దీంతో దేశం బతుకు జీవుడా అంటూ ఊపిరి తీసుకుంటున్నది. పైన చెప్పిన మాంత్రికుడు రెండు రాష్ర్టాలు రెండు కళ్లంటూ 7 మండలాలు దొబ్బిపొయ్యాడు, రాష్ట్రం పుట్టీ పుట్టకముందే. ఇప్పుడు తన శిష్యుని మంత్రదండంతో ఏం చేస్తాడో తెలియదు.
మొన్ననే ఒక రచయిత్రి తన వ్యంగ్య రచనలో పై జీవాత్మను పరకాయ ప్రవేశం చేయించారు. ఆ ఆత్మ వందల ఏండ్ల నుంచి తెలంగాణకు సేవ చేసిన అందరిలో ప్రవేశించి హైదరాబాద్‌ను కట్టి పడేసిందట. ఆఖరికి నిజాం నవాబుల్లో కూడా ప్రవేశించి హైదరాబాద్‌ను తీర్చిదిద్దిందట. నిజాం నవాబులు వెళ్లిపోయాక ప్రేతాత్మలా ఇప్పుడు శీతకన్ను, వేడి నీటి కళ్లతో మళ్లీ అభివృద్ధి పరుస్తోంది అట. (పరిచిందట!) ఈ అభివృద్ధి భరించలేక మళ్లీ తెలంగాణీయులు వలసపోవాలేమో. ‘జై తెలంగాణ’ అని ఒక్కసారి కూడా అనని ఆ ఆత్మ శిష్యులు కొలువుదీరి ఉండటం వారి అదృష్టం. తెలంగాణ ప్రజల దురదృష్టం. పదేండ్లయినా ఈ దరిద్రం కదలక పడగలు సాచటం ఎంత దురదృష్టం. ఈ ఆత్మలకు దేవుడంటే భయం, భక్తి ఏమీ లేవు. వెనుకటికి ఒకాయనా ఆయన అంతే వాసి, ఏడుకొండల వాడికి ఏడు కొండలెక్కడివి రెండే కొండలన్నాడు. అంతే! ఆయన ఆ కొండలల్లో కల్సిపోయాడు. ఇప్పుడు వర్ణిస్తున్న ఆయన కూడా ఏడుకొండల వాడిపై ఏదో కూసి చావుతప్పి శీతకన్ను, వేడి కన్నులతో బతికి బయటపడ్డాడు. అంతటి పవర్ఫుల్ కళ్లు అవి. ఎప్పటికి మంది సొమ్ము తమవారికి ఎలా దోచిపెట్టాలనే తపనే! (తమ రాష్ర్టానికి కాదు).
కానీ, బిడ్డల్లారా! ఇల్లలుకగానే పండగ కాదు. తెలంగాణ ఎప్పటికీ ఉద్యమాలు చేసే గడ్డనే! ఒక్కసారి గాలి వీస్తే ఊబిది లేచిపోయి నిప్పు కణం బయటికి వచ్చి దుష్టచతుష్టయాలను, శకునులను మాడ్చి మసిచేస్తాయి.
పక్క రాష్ట్రం నుంచి వచ్చి రాజకీయాలు చేస్తామంటే కుదరదు, జాగ్రత్త. ఈ రాష్ట్రంలో బతుకుదెరువు చూసుకొని బతుకుతున్న సీమాంధ్రులతో మా వంటి అసలు తెలంగాణీయులకు పేచీ ఏమీ లేదు. వారితో మేము ఎప్పుడో కల్సిపోయాం. కానీ ఎప్పటికి పక్కవాడిని ఎలా మోసం చెయ్యాలా? ఎలా దోపిడీ చేయాలా? అని ఆలోచిస్తూ రాజకీయాలు చేస్తున్న దురాత్ములతోనే చిక్కు. రాజకీయం చేసేవాళ్లు తెలంగాణ నుంచి వెళ్లిపోయి మీ ఊర్లో, మీ రాష్ట్రంలో రాజకీయాలు, ఆ భాగోతాలు ఆడుకొండి. మాకేం అభ్యంతరాలు లేవు. మా బతుకు మమ్మల్ని బ తుకనీయండి. డబ్బులిచ్చి బాకాలూదించుకునే మీడియా, డ బ్బులిచ్చి డబ్బా కొట్టించుకునే శిష్యప్రశిష్యులతో అక్కడ విర్రవీగండి. ఇక్కడ ఎలాంటి వెర్రి చేష్టలు చేసినా ఉద్యమంలో పాల్గొన్నవారు (మా వంటి వారు) ఇంకా బతికే ఉన్నారు జాగ్రత్త.
వెరసి తెలంగాణ తమ్ముళ్లకు, అక్కాచెళ్లెళ్లకు చెప్పేదేమిటంటే శత్రువులు మనల్ని వెన్నాడుతున్నారు. ఇంకా బతికే ఉన్నారు. ఏమరుపాటున ఉంటే ఏమవుతుందో.. అసలు తెలంగాణ వాదులు చేసిన అభివృద్ధి, నకిలి తెలంగాణ వాదులు చేసే అభివృద్ధి చూశారు, చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఏమరుపాటున ఉంటే మరోసారి నీళ్లు, నిధులు, నియామకాలు ఉష్కాకి! అన్న మాయమవుతాయి.
అప్పటికి మాలాంటి వృద్ధులు ఉండకపోవచ్చు. కానీ, ఏమైనా జరిగితే మా ఆత్మలు ఘోషిస్తాయి. అలా జరగకుండా జాగ్రత్తపడండి. అప్రమత్తంగా ఉండండి. అన్యాయాలను చీల్చి చెండాడే సమయం కోసం వేచి చూస్తూ ఉండండి.
– డాక్టర్ చెన్నమనేని హన్మంతరావు
98490 18120
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

