కొత ్తగానుగ

కాలచక్రం తిరిగినట్లే
గానుగ చక్రం తిరుగుతుంటది
ఉగాది నాడు సృష్టి ఆరంభమైనట్లే
తొట్టిలో వేసే పిడికిళ్ళ నూనె గింజలతో
అదే రోజు మా బతుకుదెరువు ఆరంభమైతది!
చేతిలో లింగం పట్టినట్లే
గానుగ తొట్టిలో కణెం పెట్టి ఉంటది
ఎప్పుడూ మాకు తోడై
రెండెద్దుల సవారీ హాజరుగా నిలవడ్తది
గానుగలో నలుగుతున్న గింజలను కాస్తా తడి చేస్తే
చమురు దానంతట అదే వస్తది!
తరం ఎత్తి పిప్పి చెక్కలను తీయాలంటే
మా తరం యాడైతది..?
గానుగ పిండి చెక్కలే మా కండపుష్టి
గానుగెద్దు కష్టం మా బతుకులు
మేము అక్కడే తిరుగుతం..
కానీ ప్రపంచానికి వెలుగైతం
దేవుడి ముందు దీపం వెలిగియ్యాలంటే
నలిగిన మేము వత్తిలాగా నిలవడ్తం
దునియా మొత్తానికి మేం జ్యోతులై వెలుగునిస్తున్నం
నూనె డబ్బా నెత్తినెత్తుకొని ఎదురువడ్తె
శనిగాళ్ళని శకునం జూస్తరుగానీ..
తైలాభిషేకం అంటూ అదే నూనెతో
గ్రహచారం సరిజేసుకుంటరు!
మమ్మల్ని రాజులు పోషించినా
వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే
‘మై గాంచ్ తేలీహూ’ అంటూ మహాత్మా గాంధీతో
నామకరణం చేయించుకున్నోళ్ళం
స్వాతంత్య్ర సమరంలో కదం కదిపినోళ్ళం
తెలీవాలాలం
గానుగ నూనెతీసి బతికేటోళ్ళం
మేము గాండ్లోళ్ళం!!
జయంతి వాసరచెట్ల
99855 25355
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- chelime
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

