అభివృద్ధి చేతకాని కాంగ్రెస్ సర్కార్
పాలనలో జీవో పాస్ చేస్తే గన్ నుంచి బయటకు వచ్చే బుల్లెట్లా, ధనుస్సు వదిలిన బాణంలా అమలు జరిగి తీరాలి. నిజానికి ఒక పాలనా దక్షత వున్న వ్యక్తి అయితే ఇలాంటి విషయాలను ముందే అంచనా వేసి, సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉండేది.
ప్రజా పాలన రేవంత్ ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని అందరూ అంటుంటే ఏమో అనుకున్నాను. కానీ అలా అనుకోవడం సరియైనదేనని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ వద్ద చేపట్టనున్న భారీ ప్రాజెక్టు. ఇందుకు అనుగుణంగా దాదాపు 2,500 పచ్చని చెట్లను నరికివేశారు. పనులు ప్రారంభించి, కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. దీనిపై పర్యావరణవేత్తలు, వివిధ ప్రజా సంఘాలు కోర్టులను ఆశ్రయించడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తొలుత కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించాలనుకున్న 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లను రద్దు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. కోర్టు మొట్టికాయలు వేయడంతో ఈ పనులకు బ్రేక్ పడింది. ఇటీవల ఈ ప్రాజెక్టులో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ర్టానికి, పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లిందో గమనించవచ్చు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో హరితహారం పేరుతో కోట్లాది మొక్కలు నాటి, పెంచి పర్యావరణ సంరక్షకుడయ్యారు. కానీ రేవంత్ చెట్లను నరికి పర్యావరణ విధ్వంసకుడిలా మారారు.
పాలనలో జీవో పాస్ చేస్తే గన్ నుంచి బయటకు వచ్చే బుల్లెట్లా, ధనుస్సు వదిలిన బాణంలా అమలు జరిగి తీరాలి. నిజానికి ఒక పాలనా దక్షత వున్న వ్యక్తి అయితే ఇలాంటి విషయాలను ముందే అంచనా వేసి, సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉండేది. పార్క్ పరిసరాలను ధ్వంసం చేయకముందు, వేలాది చెట్లను నరికివేయక ముందు, వందల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయకముందే ఈ విషయాన్ని ఊహించి ఉండేవాడు. కానీ అలా చేయకుండా అభివృద్ధి మాటున అప్పనంగా ప్రజాధనాన్ని దోచుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న తప్పుడు నిర్ణయమేనని భావించక తప్పదు.
ఈ నయా తుగ్లక్ పాలనలో రూ.3,296 కోట్ల విలువైన రేడియల్ రోడ్డు-2 టెండర్లలో భారీగా అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నది. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్ దాకా వేసే ఇంత పెద్ద ప్రాజెక్టును స్థానిక కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా స్థానికేతరులు, తన రాజకీయ గురువు, ఏపీ సీఎం చంద్రబాబుకు దగ్గరి వాళ్లకు టెండర్లు అప్పజెప్పారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ టెండర్ ప్రక్రియ అంతా రేవంత్‌రెడ్డి సొంత మంత్రిత్వ శాఖలోనే జరిగిందని స్వయానా కాంగ్రెస్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా మీడియా సమక్షంలో ఆరోపించారు. దీంతో రేడియల్ రోడ్డు-2 టెండర్లలో భారీగా అవకతవకలు, అవినీతి కచ్చితంగా జరిగాయని తేలిపోయింది. సహజంగా టెండర్ ప్రక్రియ తక్కువ రేటుకు ఇవ్వాలనేది ప్రభుత్వ నిబంధన. అయితే కమీషన్లు తీసుకునేందుకు బడా కాంట్రాక్టర్లకు, ఎక్కువ రేట్లను కోట్ చేసిన వారికి అప్పజెప్పి రాష్ట్ర ఖజానాకు గండికొట్టడం దారుణం కాదా?
రాష్ట్రంలోని గురుకులాల్లో 8 వందల కోట్ల ఆహార టెండర్ల విషయంలో కూడా ఇదే తరహా అవినీతి చోటుచేసుకున్నదని తెలుస్తున్నది. సిరుల గని సింగరేణిలో కూడా కాంగ్రెస్ పాలనలో అవినీతి పేరుకుపోయింది. ప్రస్తుతం ఆ సంస్థ మూతపడే స్థితికి దిగజారింది. దొరికింది దొరికినట్టు అదే పనిగా రేవంత్, అతని సోదరులు దోచుకుంటుంటే రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ విషయాలన్నీ కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే రాష్ట్రం ఎంతటి దివాళా పరిస్థితిలోకి కూరుకుపోతున్నదో అర్థమవుతున్నది. మూసీ నది ప్రక్షాళన కూడా అవినీతిమయమే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో ప్రతి రంగమూ పరిఢవిల్లింది. దేశానికి తెలంగాణ దశ, దిశ అయిందన్న విషయం సాక్షాత్తు రిజర్వు బ్యాంకే సాక్ష్యాధారాలతో వెల్లడించింది. జీఎస్టీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, వ్యవసాయం. ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్-2024 నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్పాయి. తెలంగాణను దేశంతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లారు కేసీఆర్. ఆయన విజయగాథను, అభివృద్ధి కాంక్షను తట్టుకోలేక, పోటీపడే సత్తా లేక రేవంత్‌రెడ్డి అభియోగాలతో ఝూటామాటలతో కాలం గడుపుతున్నారు. పాలనా దక్షత లేక, సరైన ప్రణాళికలను రూపకల్పన చేసే పరిణతి లేక కేసీఆర్ కుటుంబంపై నిందలు వేస్తూ లేనిపోని అభియోగాలు మోపుతున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పాలనను నిశితంగా గమనించినట్లయితే అభివృద్ధి కంటే ఆర్భాటం ఎక్కువగా ఉంటున్నది.
ఆర్ఆర్ఆర్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

