తెలంగాణ గంగాళం
‘కొండల నుంచి కోనల నుంచి గోదావరమ్మ పరుగులు చూడు/ ఒంపులు తిరుగుతూ ఒయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు/ ఏటిలో ఊట చూడు.. చెలిమెల సెగలు చూడు/... కో .. కో.. కో... అంటూ కోకిలమ్మ పాట/ కిల కిల కిల కిల రామచిలుక పలుకు/ పావురాల జంట చూడు..
‘కొండల నుంచి కోనల నుంచి గోదావరమ్మ పరుగులు చూడు/ ఒంపులు తిరుగుతూ ఒయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు/ ఏటిలో ఊట చూడు.. చెలిమెల సెగలు చూడు/… కో .. కో.. కో… అంటూ కోకిలమ్మ పాట/ కిల కిల కిల కిల రామచిలుక పలుకు/ పావురాల జంట చూడు.. పాలపిట్ట పాట విను/.. పక్షులు మనుషులు కలిసి బతికెడి అడవితల్లి అందం చూడు… రేలా రేలా రేలా రేలారేలారే…’ అడవి తల్లికో దండాలో… తల్లి మా అడవికో దండాలో.. అంటూ సాగే ఈ అందమైన పాట వినని తెలంగాణ బిడ్డలుండరు! కోనల నుంచి కొండలకు ఎగబాకుతున్న గోదావరి హొయలు, పక్షుల కిలలు, హరితవనాల అలరింపులతో స్వయంపాలక తెలంగాణ నేడు మురిసిపోతున్నది. సరికొత్త రిజర్వాయర్లూ కాలువలతో కూడిన, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం జల పథకం ముగింపు దశలో మల్లన్న సాగర్ తటాకాన్ని అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణ విజయయాత్రను ధీమాగా ప్రపంచానికి చాటిచెప్పారు. మానవ నాగరికతా ప్రస్థానంలో ఇదొక సముజ్వల ఘట్టం.
తెలంగాణ అంటేనే ‘సరస్సుల భూమి’. నదీమ తల్లుల ఒడిలో మానవ జీవన వికాసం సాగినా, తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ప్రకృతి వరంగా భావించి, ఊరూరా చెరువులు నిర్మించుకున్న గొప్ప నాగరికత మనది! ఆ జాడలో అడుగులు వేస్త్తూనే, నదీమాతకు కొత్త నడకలు నేర్పి యాభై టీఎంసీల భారీ జలరాశితో మల్లన్నసాగర్‌ను నిర్మించుకోవడం నీటిపారుదల రంగంలోనే అద్భుత ప్రయోగం. ‘తెలంగాణ గంగాళం’ అంటూ ముద్దుగా చెప్పుకొంటున్న మల్లన్న మహా సాగరం తెలంగాణ నలుదిక్కులా జల వనరులను పంపిణీ చేసే గుండెకాయ! ఈ వంక కొండ పోచమ్మ సాగరం, ఆ వంక సింగూరు జలాశయం, మరో వంక నిజాం సాగరం.. అల్లంత దూరాన బస్వాపూర్, గంధమల్ల జల నిధులు! ఎక్కడి గోదావరి.. ఎక్కడి భువనగిరి.. ఎంత దూరమని ఈ నడకలు! కలలోనూ కనలేని కేసీఆర్ వినూత్న ప్రయోగాలు!
మంజీరాది ఉపనదులను తనలో ఇముడ్చుకొని ముందుకు సాగిపోయే గోదావరమ్మను వెనుకకు మళ్ళించి తెలంగాణ అంతటా అనేక జలమాలలు, తటాకాలు సృష్టించడం మానవ నిర్మిత మహాద్భుతం. ‘..నా తెలంగాణమ్ము గీత నృత్తములతో నెందాక నిన్ను పూజించుచుండు/ నెందాక నిరుపేదలంది నీ జలధార పండింత్రు కొల్లగా పైరు పంట’… అంతదాక మహీమండలాంతరమున/ నీ వెలుంగుకు రవ్వంత నీడరాదు/ దివ్య గోదావరీ గృహాంతికమునందు నీ విలాసమేనాటికి నిలిచిపోదు’ అంటూ ఆనాడు నిజాంసాగరంపై దాశరథి వెలువరించిన పాద పంక్తులు నేటి మల్లన్న సాగరానికి సరిపోతాయి. తెలంగాణమంతా పరుచుకుని పునీతం చేసే క్రమంలో గోదావరి అనేక మజిలీలు చేస్తున్నది. మల్లన్న మహాసాగరమూ ఒక మజిలీ! బంగారు భారతానికి తోవ చూపే ఒక బిజిలీ!
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

