ఆత్మహత్యలను నివారిద్దాం!
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. ఇంకోవైపు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునే పనిలో ఉంటాయి. ర్యాంకులు, మార్కుల ఒత్తిడిలో విద్యార్థులు నలిగిపోతుంటారు.
డిసెంబర్ నెల వచ్చిందంటే విద్యార్థుల్లో పరీక్షల గురించిన ఆందోళన మొదలవుతుంది. ఒకవైపు సిలబస్ పూర్తి చేసే హడావుడిలో ఉపాధ్యాయులు, అధ్యాపకులుంటారు. మరోవైపు వివిధ ప్రవేశ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలవుతుంటాయి. ఇంకోవైపు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకునే పనిలో ఉంటాయి. ర్యాంకులు, మార్కుల ఒత్తిడిలో విద్యార్థులు నలిగిపోతుంటారు. ఫలితంగా వారు తీవ్ర నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.
ఓడిపోవడం తప్పు కాదు. విజయానికి అది ఓ మెట్టు మాత్రమే. కానీ మారుతున్న కాలానికి తగ్గట్టుగా పరుగులు తీయలేక కొందరు, ఆర్థిక, వ్యక్తిగత, మానసిక..ఇలా అనేక కారణాలతో మరికొందరు తనువు చాలిస్తున్నారు. అయితే బతికి సాధించాలే తప్ప, ఆత్మహత్యలతో ఎలాంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలు కూడా అంధకారమవుతాయి.
పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. ఎవరైతే తాను ఇక బతకడం వృథా అని, పదే పదే ఆత్మహత్యల గురించి మాట్లాడుతారో, తమకు తామే హాని చేసుకోవడానికి యత్నిస్తారో వారిలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడుతారు. ప్రతి సందర్భంలోనూ చికాకుపడుతుంటారు. ఇతరులతో మాట్లాడకుండా ఏకాకిగా ఉండాలనుకుంటారు. తాము చేసే ప్రతి పనిలోనూ అసంతృప్తిగా ఉండటం, నిద్రలేమితో బాధపడటం, జీవితంలో తనకు కావాల్సింది ఏదీ దక్కలేదని పదే పదే ప్రస్తావించడం లాంటి లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తులు ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మానసిక వైద్యనిపుణులు చెప్తున్నారు. మరికొందరు మీడియా ప్రభావంతో తాత్కాలిక ఆకర్షణకులోనై, ప్రేమ పేరుతో భావోద్వేగాలతో, తాము అనుకున్నది పొందలేకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
కరోనా కారణంగా విద్యార్థులు చాలాకాలం చదువులకు దూరంగా ఉన్నారు. దాంతో పరోక్షంగా పిల్లలపై ఒత్తిడి పెరిగింది. చాలామంది ప్రాథమిక అంశాలు కూడా మరిచిపోయారు. ఇప్పుడిప్పుడే విద్యార్థులు గాడినపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్న దాని ప్రకారం 15 నుంచి 19 ఏండ్ల వయస్సు గల యువతలో మరణానికి నాలుగో ప్రధాన కారణం ఆత్మహత్య అని తెలుస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7 లక్షల మందికి పైగా ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇందులో 77 శాతం కేసులు తక్కువ, మధ్య ఆదాయ దేశాల నుంచి ఉంటున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రకారం, చాలామంది ప్రజలు పురుగుమందులు తాగి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే, ఇటువంటి ఆత్మహత్యలను నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది.
ఆత్మహత్యలను నియంత్రించాలంటే విద్యాలయాల్లో మానసిక నిపుణులను నియమించాలి. వారిచేత విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. కొన్ని సమయాల్లో కొన్ని కోర్సులకే డిమాండ్ ఉంటుంది. విద్యార్థులు వేలాది రూపాయలు వెచ్చించి వాటిని నేర్చుకుంటారు. తీరా నేర్చుకున్నాక వాటితో ఉపాధి అవకాశాలు రాకుండా పోతాయి. వివిధ కోర్సులకు సమాన అవకాశాలు ఉండేవిధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. విద్యార్థులతో తల్లిదండ్రులు ప్రతిరోజు కొంత సమయం గడపాలి. వారి అవసరాలను, ఇబ్బందులను తెలుసుకోవాలి. మార్కులే ప్రామాణికంగా కాకుండా వారికి విభిన్న రంగాల్లో రాణించేలా శిక్షణ ఇప్పించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆత్మహత్యల నివారణకు కృషిచేయాలి.
-యం.రాం ప్రదీప్
9492712836
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

