సీ:
సవురుపూ గుత్తుల చివరంట జుర్రిన
తేటి పిండులపాట తెనుగుబాస
అలమావి చివురుల కలమావి గున్నపై
కోయిల కూసెడి కూత తెలుగు
భారతీ మంజీర చారణాంచలగీతి
తేనియలొలికించు తెలుగుకూయి
హాయిగా గగనాన హోయలూరించెడి
పారవతశ్రేణి తేరుతెనుగు
తేగీ!!. మించు పల్కుల పూదోట మంచతేరి
పయన మయ్యెడి మాతెల్గు పైన వెలయు
అమ్మకమ్మ పల్కుల పైదమ్మిలడుగ
దలచి కొలుతునా తెలుగుపై దలిని గూర్చి!
గొల్లపల్లి రఘు రామ శర్మ: 99891494 54