మిత్రోఁ..!
వెలుతురు పిట్టలు
పిడికిలెత్తనందుకే
జనం వంతెన కింది
ప్రవాహమైపోతున్నరు!
కొలిమిని రాజేసే
నిప్పురవ్వలు నివురు గప్పినందుకే
వరదలకు తలొగ్గే
గరిక పోచలవుతున్నారు!
వేలెత్తి చూపితే
వేలు విరుస్తున్నా
కన్నెర్ర జేస్తే కుళ్ల బొడుస్తున్నా
చైతన్య దీపాల మౌనం
దేశాన్ని చీకటితో వెలిగిస్తున్నది!
అమ్మకాలు అతనికి
ఎనిమిదో వ్యసనమే కావచ్చు
గుడ్లప్పగించి చూడటం
నెత్తురు మండే శక్తుల చారిత్రక తప్పిదమే!
రజకుడు నిలదీస్తే
అర్ధాంగిని అగ్నిప్రవేశానికి ఆదేశించిన
ప్రజాస్వామ్య దేశమిది
జనాభిప్రాయాన్ని మన్నించనివాడు
ప్రభువెన్నడు కాజాలడు!
అగ్ని పరీక్షకు నిలువని సింహాసనాలు
కాలగర్భంలో కలవాల్సిందే..!!
కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

