తెలుగు తేజం పీ.వీ

సీ ॥ శ్రీవాణి తనలోన స్థిరముగా కొలువయి
గర్భంబు నందునే గడిపె నేమొ !
ఆ బృహస్పతి తానె యావహించిన క్షణ
మందునే జననంబు నందె నేమొ !
శ్రీకృష్ణ పరమాత్మ జీవమై నిలుచుండ
పురిటినొప్పుల తోడఁ బుట్టె నేమొ !
బ్రహ్మయే తనచేతి వ్రాతలన్ మార్చగా
మారు రూపంబునన్ బంపె నేమొ !
తే॥గీ॥ వాక్కు , బుద్ధియు, చతురత, భవిత దిద్దు
నేర్పు లొక్కటై వచ్చిన నేత యౌట
నిజము నిజమిది నరసింహుఁడీ జగాన
మహిత కారణ జన్ముండు మరువలేము !
సీ ॥ ఉద్యమాలొక ప్రక్క విద్యయు నొకప్రక్క
ఏక కాలమునందు స్వీకరించి
రెంటికిన్ న్యాయంబు నొంటిగా జేసిన
ఘనుఁడు కదా ! పీవి తెనుఁగు ఠీవి !
యువకునిలో రేగెడుడుకు రక్తము దనన్
స్వాతంత్య్ర పోరాట సమర మునకు
పరుగులు వెట్టించ పదములు గలిపెను
వ్యాసముల్ వ్రాసె నుద్యమము పైన
తే॥గీ॥ ఒక్క ప్రక్క నిజాముని నక్క జిత్తు
లొక్క ప్రక్క తెల్లదొరల లెక్కలేని
యట్టి దమనకాండ మనసు నగ్ని రేపె
సింహమయ్యెను మన నరసింహ మపుడు !
సీ॥ బలములేని ప్రభుత్వ పగ్గాలు చేఁబట్టి
ఊపిరిలూదిన యుత్తముండు
అధికార పార్టీకి నండయై నిలచిన
ధీరుఁడీతఁడు మహా దిగ్గజుండు
దిగజారిపోవు నార్థిక పరిస్థితిఁజూచి
గాడిని పెట్టిన వాడితండు
అపరచాణక్యుడై యధికారమును పూర్తి
అయిదేండ్లు నిల్పిన యట్టి ఘనుఁడు
ఆ॥వె॥ క్షీర సాగరంబు చిల్కగ నానాడు
తొట్ట దొలుత విషము బుట్టినట్లు
పీఠ మెక్కిన వెనువెంట వైషమ్యముల్
బుట్టె నయిన ఁదాని నెట్టినాడు
డా॥ వూసల రజనీగంగాధర్
పీవీ స్మారక లెజండరీ పురస్కార గ్రహీత
9290680605
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

