సముద్రం వాకిట్లోకి వచ్చి నిలబడింది
మరి, గుక్కెడు మంచినీళ్లకోసం
గుడిసె ముందు బేలగా నిలబడింది.. ఎందుకో?
చిన్న గాలివాటుకే ఎగిరిపోయే తాటాకుల గుడిసె
సంద్రం ముందు దాని రుబాబు ఎంత?
ఐనా, ఈ క్షణం గుడిసె ఛాతీ విరుచుకొని ఉంది
ఉప్పు సముద్రాలనే కళ్లలో నింపుకొని ఉన్న గుడిసె
నదులను మింగినా తీరని దాహం సముద్రానిది
సముద్రాలను కళ్లలో ఒంపుకున్నా
ఒడువని దుఃఖం గుడిసెది
వెయ్యి నాలుకలతో తీరాన్ని తాకినా
సముద్రానిది తీరని దాహం
గుడిసె లోపలి మట్టి కుండలోని
నీటితో తీరాలి దాని దాహం
– డాక్టర్ రూప్‌కుమార్ డబ్బీకార్ 91778 57389