వర్షాకాలంలో బయటికి వెళ్లే ముందు వాతావరణశాఖ ఏమి చెప్పిందనేది టీవీనో, న్యూస్పేపరో చూసి తెలుసుకుంటాం. ఇక నుంచి ఆ అవసరం లేదు.. మా పార్టీ ఆఫీసుకు ఒక్క ఫోన్ కొట్టండి చాలు.. మా పార్టీ వాతావరణశాఖ అనుబంధ విభాగం మీ సందేహాలను తీర్చుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అంటున్నాయి. ఆశ్చర్యపోకండి… ఇటీవల ఈ రెండు పార్టీల కార్యాలయాల్లో వాతావరణశాఖ శాస్త్రవేత్తలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులంతా కట్టె పట్టుకొని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన లెవెల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చారు. క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటీ? క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి? మేఘాలు ఎలా ఏర్పడుతాయి…వర్షాలు ఎలా కురుస్తాయని వాట్సాప్ యూనివర్సిటీ పాఠాలు వల్లెవేస్తూ మీడియా బుర్ర తిన్నారు.