బీఆర్ఎస్ మరో పోరుకేక
గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడే తెలంగాణ నేల ఇది. బీఆర్ఎస్ అంటే ఇక్కడి ఇంటి పార్టీ. బయటి పార్టీలన్నీ ఢిల్లీకి గులాములే. ‘జీ హుకుం సర్దార్.. జో హుకుం సర్కార్' అంటూ సలాములు కొట్టే పార్టీలే. కానీ బీఆర్ఎస్ అంటే ఇక్కడి ప్రజల కష్టనష్టాలు తెలిసిన పార్టీ. పాతికేండ్ల ప్రయాణమం తా ఆ కష్టనష్టాలపై పోరాటాలు, ప్రభుత్వంగా పరిష్కారాల ప్రస్థానమే.
గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడే తెలంగాణ నేల ఇది. బీఆర్ఎస్ అంటే ఇక్కడి ఇంటి పార్టీ. బయటి పార్టీలన్నీ ఢిల్లీకి గులాములే. ‘జీ హుకుం సర్దార్.. జో హుకుం సర్కార్’ అంటూ సలాములు కొట్టే పార్టీలే. కానీ బీఆర్ఎస్ అంటే ఇక్కడి ప్రజల కష్టనష్టాలు తెలిసిన పార్టీ. పాతికేండ్ల ప్రయాణమం తా ఆ కష్టనష్టాలపై పోరాటాలు, ప్రభుత్వంగా పరిష్కారాల ప్రస్థానమే. మలిదశ ఉద్యమాన్ని మహోధృతంగా మలిచి, మొక్కవోని దీక్షాదక్షతలతో నిలిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన పార్టీ, సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టిన ప్రగతి సారథి బీఆర్ఎస్. ఇన్నేండ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నెన్ని ఆటుపోట్లు? ఎన్నెన్ని వెన్నుపోట్లు? అన్నిటినీ తట్టుకుని అజేయంగా నిలిచి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ బీఆర్ఎస్.
కేసీఆర్ అనే మూడక్షరాలే తారకమంత్రంగా మునుముందుకు సాగిన పార్టీ బీఆర్ఎస్. బక్కమనిషి ఉక్కు సంకల్పం తెలంగాణ ఆర్తిని దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. గల్లీని, ఢిల్లీని ఏకం చేసి ఉద్యమ స్ఫూర్తిని ని రంతరంగా రగిలించింది. బయలుదేరిననాడు కేసీఆర్ ఒక్కరే. కానీ నేడు ఆయన తెలంగాణకు తిరుగులేని దళపతి. ఇంటింటా మార్మోగే గొంతు. గుండెగుండెపై రెపరెపలాడే జెండా. అపజయాలను విజయసోపానాలుగా మలుచుకుని అజేయంగా నిలిచిన ధీశాలి. గడ్డిపోచల్ని ఉక్కు ఊచలుగా మలచిన సమరశీలి. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి గమ్యాన్ని ముద్దాడిన మృత్యుంజయుడు. రెండున్నర దశాబ్దాలకు పైగా జరిగిన ప్రయాణంలో అతడే బీఆర్ఎస్ కర్త, కర్మ, క్రియ. తెలంగాణ సాధకుడిగా, ప్రగతిరథ చోదకుడిగా పదేండ్ల అభ్యుదయాన్ని లిఖించిన దార్శనికుడు కేసీఆర్. దీక్షాదక్షతల్లో ఆయనకు ఆయనే సాటి. ప్రత్యర్థులను చిత్తు చేయడంలో అసమాన మేటి.
ఈ సుదీర్ఘ యాత్రలో చిన్న కుదుపు. పిడికెడంత విరామం. మోసపోయి గోసపడుతున్న ప్రజల బాధలు కేసీఆర్కు తెలుసు. బంగారు తెలంగాణ కోసం సాగిన ఏరువాక అర్ధంతరంగా ఆగిపోయింది. కల చెదిరింది. కథ మా రింది. ఏదో ఏమరుపాటున ఓటును చేజార్చుకుని, ‘ఎంతపనాయే’ అని తెలంగాణ బిడ్డలు ఇపుడు మథనపడుతున్నారు. ఈ దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ మరోసారి సమరశంఖం పూరించారు. ప్రతిఒక్కరికీ ఓ పెద్దదిక్కులా పక్కన కూసుండి ‘నేనున్న తియ్యి బిడ్డా నీకు’ అని భుజం తట్టినట్టు అయ్యింది. దటీజ్ కేసీఆర్. దారీతెన్నూ తెలియని తెలంగాణవాదాన్ని పట్టాలెక్కించి పరుగులు పెట్టించిన సాహసి కదా. తెలంగాణ ద్రోహుల మోసకారి వ్యూహాలను పటాపంచలు చేసి ఢిల్లీ కోటను ముట్టడించిన వీరుడు కదా. రాష్ట్ర సాధన తర్వాత పాలనాపగ్గాలు చేపట్టి ‘ఇంతింతై, వటుండితై’ అన్నట్టుగా మహోజ్వల శకాన్ని సాధించిన ప్రగతి పిపాసి కదా. సరికొత్త రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినవాడు కదా.
అందుకే మరో యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఓటమికి భయపడి కాడి పడేసే బాపతు కాదు కేసీఆర్. అట్లయితే తెలంగాణ వచ్చునా, సమున్నతంగా నిలుచునా? మాటల్లో పెట్టి ఓటును మాయ చేసే కేటుగాళ్ల వలలో చిక్కి విలవిల్లాడుతున్న తెలంగాణకు కేసీఆర్ మాట ఓ ఊరట. తననే నమ్ముకుని తండ్లాడుతున్న బిడ్డల కోసం మరోసారి ఆయ న పోరుబాట పట్టారు. కేసీఆర్ అంటే సాదాసీదా రాజకీయ నేత కాదు. తెలంగాణను అణువణువూ నింపుకున్న స్వాప్నికుడు. జనం గోసలు ఆయనకన్నా ఎవరికి బాగా తెలుసు? మఖలో పుట్టి పుబ్బలో మాడిపోయే సీజనల్ పార్టీ కాదు బీఆర్ఎస్. అచ్చమైన రీజనల్ పార్టీ. ప్రజలతో మమేకమైన ప్రబల రాజకీయ శక్తి. మాయదారి మాటలతో గద్దెనెక్కి, మోసకారి పాలన సాగిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. ఫలితంగా జనజీవితం అతలాకుతలం అవుతున్నది. సోయిలేని నేతల ఏలుబడిలో ఆత్మగౌరవం అడుగంటుతున్నది. అందుకే కేసీఆర్ కదిలారు. గూడు చెదిరిన తెలంగాణ పునర్నిర్మాణానికి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సాక్షిగా పునరంకితమయ్యారు. ఇక విందాం ప్రజాగళ గర్జన. మోసకారి పాలకుల్లో మొదలైన తర్జనభర్జన.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- BRS
- Congress
- KCR
- Spirit Movement
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

