పద్దెనిమిదేండ్లు నిండాయంటే
ఓటు హక్కును పొందాలోయ్
పనుల ఒత్తిడి ఉన్నా కానీ
ఓట్లు తప్పక వేయాలోయ్
ఎన్నికలోయ్ ఎన్నికలోయ్
మునుగోడు ఉప ఎన్నికలోయ్
పార్టీ లెన్ని వచ్చిన గానీ
పనిచేసే నాయకుడికి ఓటు వేయాలోయ్…
ఓటుకు నోటని ఎవరన్నా అన్నారంటే
పొలిమేర అవతలకు తరమాలోయ్
ఎన్నికలోయ్ ఎన్నికలోయ్
మునుగోడు ఉప ఎన్నికలోయ్
మాటల గారడీకి పడిపోకుండా
మహనీయుల మాటల వైపు ఉండాలోయ్
లాభనష్టాలు బేరీజు వేయక
నిజాయితీపరులను గెలిపించాలోయ్
ఎన్నికలోయ్ ఎన్నికలోయ్
మునుగోడు ఉప ఎన్నికలోయ్….
నరేష్ జాటోత్: 82478 87267