తేకువగలవారు తెలంగాణ బిడ్డలు
అణిగిమణిగివుండునతిరథులిల
కేంద్ర కుట్రలన్ని ఖిలము చేసెడివారు
అమ్ముడయ్యెసరుకునసలు కాదు!
రాష్ట్ర ప్రభుతకూల్చ రక్తియు క్తులన్నను
కేంద్ర ప్రభుత చేష్టక్లిష్టతరము
డబ్బువల్ల తాము దారిదప్పి నడుచుట
నీతికానెకాదుఖ్యాతి చెడును!
ఇతర రాష్ట్ర ప్రభుత లింపుగా కూల్చుట
బలుపు చూచుకొన్న వాపు సుమ్మి
కలిమిబలిమి వల్ల కదలవు ప్రభుతలు
కలలుగన్న మీకు పగటికలలె!
సరస ధరకు కొనగ శాసనసభ్యులు
వస్తువులును ‘కారు’ వంధితులను
మాయమాటలనిల మర్మమెరి గినట్టి
కీలు చూచివాత పెట్టగలరు!
తప్పు చేయు మీకు తలరాత మారును
భ్రష్టుబట్టి పోవు భావికీర్తి
సద్దిముల్లెలన్ని సర్దుకొనియు వెళ్ళండి
తిరిగిరాకతోడ తిమ్మిరణగు!
చింతోజు పద్మావతి: 86469 54860