ఒట్టి మనిషినై.. గట్టి మనసునై..
మోయాలి.. జీవం ఆరేంతవరకు లోకాన్ని.. కాలాన్ని మనుషుల్ని.. వారి మనసుల్ని..
మోయాలి..
జీవం ఆరేంతవరకు
లోకాన్ని.. కాలాన్ని
మనుషుల్ని.. వారి మనసుల్ని..
మోయాలి..
వేషం తీసేదాక..
నాటకం ముగిసేదాక..
సన్నివేశాల్ని.. వాటి ఆవేశాల్ని
మోయాలి..
తెర పడేదాకా..
నీడలు ఆడేదాక..
పొంగుల్ని.. వాటి చెంగుల్ని
మోయాలి..
కష్టం తీరం దాటేదాక
కన్నీరింకే దాక
ఉప్పును.. వెనుక రుచులను
మోయాలి
ఆశ ఆకాశాన్ని చేరేదాక
నిరాశ కురిసేదాక
అంచులను.. వాటి కంచెలను
మోయాలి
చూపు తెగేదాక
కలలు తీగలు పాకేదాక
దృశ్యాలను.. వాటి లోతులను…
మోయాలి
తనకు తాను తెలికయ్యేదాక
తనలో తానే శూన్యమయ్యేదాక
అన్నీ దూరమై.. అన్నిటికీ దూరమై..
మోయాలి
భూమికి బరువయ్యే దాక
కాలానికి చివరయ్యేదాక
భరించే రాతినై.. చివర వరకు నీతినై..
మోయాలి మట్టి పిలుపు అందేదాక
ఆయువు రుణం తీరేదాక
ఒట్టి మనిషినై.. గట్టి మనసునై..
– చందలూరి నారాయణరావు
83094 63567
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- hardships
- life
- literature
- poem
RELATED ARTICLES
తాజా వార్తలు
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

