డాలరు డోలాయమానం
విశ్వ కరెన్సీగా కాలరు ఎగరేసిన డాలరు బెంబేలు పడిపోతున్నది. మార్కెట్లలో డాలరు ఆధిపత్యం బీటలు వారుతున్నది. ఆ కరెన్సీకి మూల స్థానమైన ఏకైక అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు డాలరు పాలిట శాపంగా మారుతున్నాయి.
విశ్వ కరెన్సీగా కాలరు ఎగరేసిన డాలరు బెంబేలు పడిపోతున్నది. మార్కెట్లలో డాలరు ఆధిపత్యం బీటలు వారుతున్నది. ఆ కరెన్సీకి మూల స్థానమైన ఏకైక అగ్రరాజ్యాన్ని వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు డాలరు పాలిట శాపంగా మారుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో ప్రత్యామ్నాయ కరెన్సీల హవా పెరుగుతున్నది. ప్రపంచంలో డాలరే విలువైనదని పలుదేశాల్లోని ప్రజలు అనుకుంటారు. కానీ డాలర్ కన్నా విలువైన కరెన్సీలూ ఉన్నాయి. ఉదాహరణకు కువైట్‌లోని దీనార్ సుమారు మూడు డాలర్లకు సమానం. కొన్నాళ్లుగా అమెరికాను వెంటాడుతున్న ఆర్థిక సంక్షోభం క్రీనీడలు డాలరుపై పడుతున్నాయి. అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థ పతనావస్థలోకి జారుకున్నది. ఆ ప్రకంపనలు ఇంకా కుదుపుతూనే ఉన్నాయి. ఈలోగా రుణపరిమితి సమస్య వచ్చిపడింది. అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం, యూఎస్ కాంగ్రెస్ దీనిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ ప్రతిష్టంభన చివరకు వాణిజ్య, పారిశ్రామిక మందగింపునకు దారితీయొచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా సమస్యలు అమెరికాకే పరిమితం కాదనేది తెలిసిందే. ప్రపంచ ఆర్థికవ్యవస్థను అది ప్రభావితం చేసే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో డాలరు ప్రభ తగ్గిపోయింది. దాని భవితే డోలాయమానంలో పడింది. విదేశీ మారకానికి మారుపేరుగా చలామణి అవుతున్న డాలరుపై ప్రపంచదేశాల నమ్మకం సడలుతున్నది. విశ్వ వాణిజ్యంలో డాలరు ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. డాలరుకు బదులుగా ఇతర కరెన్సీల్లో మారకం జరపాలనే డిమాండ్ అంతకంతకూ ఎక్కువవుతుండటమే దీనికి ఉదాహరణ. జపాన్ తర్వాత అత్యధిక డాలరు నిల్వలు చైనా దగ్గర ఉన్నాయి. కానీ గత కొంతకాలంగా చైనా ఆ నిల్వల్ని తగ్గించుకుంటున్నది. అమెరికాలో రుణపరిమితి గుంజాటన త్వరగా తెమలకపోతే చైనా మరింత జోరుగా డాలర్లను వదిలించుకునే అవకాశాలున్నాయి. దీనికి సమాంతరంగా తన సొంత కరెన్సీ యువాన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సహించుకోవడంపైనా చైనా దృష్టి కేంద్రీకరిస్తున్నది.
ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద డాలరు నిల్వలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. డాలరుకు బదులుగా అవి బంగారం నిల్వల వైపు మొగ్గుతుండటమే ఇందుకు కారణం. అయినా ఇప్పటికీ విదేశీ మారక ద్రవ్యంగా ప్రపంచంలో డాలరు వాటా 50 శాతం పైనే ఉంటుంది. అనేక దేశాలు అమెరికా డాలరుతో పాటుగా ఇతర కరెన్సీల్లో వాణిజ్యం జరపాలని కోరుకుంటున్నట్టు గ్లోబల్ పబ్లిక్ ఇన్వెస్టర్ 2023 వెల్లడించింది. డాలరు నుంచి వైదొలగాలనే డిమాండ్లు పెరుగుతున్నప్పటికీ రాత్రికి రాత్రే డాలరు మాయమై మరో కరెన్సీ వచ్చి కూర్చునే అవకాశాలేమీ కనిపించడం లేదు. విదేశీ మారకం విషయంలో కేంద్ర బ్యాంకులు ఆచితూచి అడుగు వేస్తాయనేది తెలిసిన సంగతే. చైనా కరెన్సీ విషయంలో ప్రపంచ మార్కెట్లో సందిగ్ధం ఉన్నప్పటికీ రాబోయేకాలంలో అది క్రమంగా పెరగడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కరెన్సీ యూరోపై కూడా ఆసక్తి పెరుగుతున్నది. ప్రత్యామ్నాయ కరెన్సీల వాటా పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

