హక్కుల హననం

వింబుల్డన్, ఫ్రెంచ్ ఒపెన్ టైటిళ్లను గెల్చుకున్న దిగ్గజ టెన్నిస్ క్రీడాకారిణి ఆమె. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ అంతర్జాతీయస్థాయి కంపెనీలను నెలకొల్పవచ్చునని నిరూపించిన వ్యాపారవేత్త ఆయన. వారిద్దరూ ఇప్పుడు రాజ్యం నిఘానీడలో బిక్కుబిక్కుమనుకుంటూ.. మాట పెగల్చలేని స్థితిలో ఉన్నారు. ఆమె పేరు పెంగ్ షుయై, ఆయన పేరు జాక్ మా. ఆ రాజ్యం చైనా. జిన్‌పింగ్ అధికారం చేపట్టిన తర్వాత చైనా వేస్తున్న అడుగులు ప్రపంచ దేశాలనే కాదు.. సొంత ప్రజలనూ కలవరపరుస్తున్నాయి. అంతకుముందు అంతోఇంతో మాట్లాడే స్వేచ్ఛ, ప్రభుత్వ విధానాల్ని విమర్శించే అవకాశం చైనీయులకు ఉండేది. కానీ, 2012లో ‘జిన్‌పింగ్ శకం’ మొదలైన తర్వాత రోజురోజుకూ అవి కుంచించుకుపోతున్నాయి.
12 ఏండ్ల వయసులో గుండెకు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా పట్టుబట్టి, టెన్నిస్ రాకెట్‌ను చేపట్టిన పెంగ్షుయై కెరీర్ అంతా పోరాటమయమే. కమ్యూనిస్టు రాజ్యంలో అనేకానేక ఆంక్షలను ఎదుర్కొంటూ ఆమె విశ్వవేదికపై పేరు తెచ్చుకున్నారు. మాజీ ఉపాధ్యక్షుడు ఝాంగ్ తనపై గతంలో జరిపిన లైంగికదాడి గురించి పెంగ్షుయై తొలిసారిగా ఈ నెల ప్రారంభంలో నోరు విప్పారు. సోషల్‌మీడియాలో పోస్టు పెట్టిన 34 నిమిషాల్లోనే ఆమె ఖాతా స్తంభించిపోయింది. ఆమె జాడ లేకుండా పోయారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత.. పెంగ్ ‘క్షేమంగానే ఉన్నారు’ అంటూ చైనా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆమె క్షేమంగానే ఉండవచ్చుగానీ.. మనసు విప్పి మాట్లాడే పరిస్థితిలో ఉన్నారా? అని క్రీడాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన మొట్టమొదటి చైనా బిజినెస్‌మ్యాన్ జాక్‌మా పరిస్థితి కూడా ఇదే. జియాంగ్ జెమిన్ వంటి పూర్వ అధ్యక్షులు కల్పించిన వెసులుబాట్లతో ఉద్భవించిన పారిశ్రామికవేత్తల్లో ఒకరైన జాక్‌మా, చైనాకే గర్వకారణంగా మారారు. అయితే, ఆయన వ్యాపారసామ్రాజ్యం రాజ్యం నియంత్రించలేని స్థాయిలో పెరుగుతుండటం చూసి, నిబంధనల పేరుతో వేటు వేశారు. దీంతో అలీబాబా చైర్మన్ పదవికి రాజీనామా చేసిన జాక్‌మా నిరుడు డిసెంబర్ నుంచి చడీచప్పుడూ లేకుండా ఉన్నారు. ప్రజల మీద, సెలబ్రిటీల మీద ఉక్కుపాదం మోపుతున్న జిన్‌పింగ్.. తానుమాత్రం జీవితాంతం దేశాధ్యక్షుడిగా ఉండటానికి వీలుగా రాజ్యాంగాన్ని సవరించారు. నియంతృత్వ పాలనతో జర్మనీని ప్రపంచంలోనే అజేయ ఆర్థిక, సైనికశక్తిగా నిలుపాలని హిట్లర్ కలలుగన్నట్లుగా చైనా విషయంలో జిన్‌పింగ్ కలలుగంటున్నారు. సంపద విషయంలో అమెరికాను చైనా ఇటీవలే అధిగమించింది. ఇక అధికారం విషయంలోనూ జిన్‌పింగ్ కలలు నిజమైతే.. అది ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందో తెలియదు. చైనా దూకుడును నిలువరించటానికి, కనీసం ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొనటానికి ప్రపంచదేశాలు ఒక కూటమిగా ఒత్తిడి తేవడం అవసరం. అయితే అది జరుగుతుందా!
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

